జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లోని ఏడు జిల్లాల్లో ‘కేదారనాథ్’పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, డిసెంబర్ 7: తమ మనోభావాలను దెబ్బతీస్తోందని హిందూ సంఘాలు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ‘కేదారనాథ్’ చలనచిత్రాన్ని ఉత్తరాఖండ్‌లోని ఏడు జిల్లాల్లో ప్రదర్శించకుండా నిషేధం విధించినట్టు ఒక అధికారి శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంఘాలు చిత్ర నిర్మాతల దిష్టిబొమ్మలను తగులబెట్టడంతో పాటు నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో జిల్లా మెజిస్ట్రేట్ నిర్ణయం మేరకు ఏడు జిల్లాల్లో ముందు జాగ్రత్తచర్యగా ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు ఏడీజీ అశోక్‌కుమార్ తెలిపారు. డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, ఉదమ్‌సింగ్‌నగర్, పారి, తెహ్రీ, అల్మోరా జిల్లాల్లో ఈ సినిమాను నిషేధించామన్నారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం 2013లో జరిగిన కథ నేపథ్యంలో ముస్లిం పోర్టర్‌కు, కేదారినాథ్‌కు వెళ్తున్న హిందూ యువతి మధ్య జరిగిన ప్రేమకథ ప్రధాన వృత్తాంతంగా సాగుతుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుట్, మొదటిసారిగా నటిస్తున్న సారా ఆలీఖాన్ ప్రధాన పాత్రలతో సాగే ఈ సినిమా హిందువుల మనోభావాలను గాయపరిచేలా, జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని ఆరోపణలు వచ్చాయి.

చిత్రం..కేదారనాథ్ చిత్రానికి వ్యతిరేకంగా శుక్రవారం జబల్‌పూర్‌లో హిందుసేవా పరిషత్ కార్యకర్తల నిరసన