జాతీయ వార్తలు

సామాజిక మాధ్యమాల్లో వదంతులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సామాజిక మాధ్యమాల ద్వారా వదంతలు, దూషించే సందేశాలను నిలుపుదల చేసేందుకు వీలుగా ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగించనున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న వదంతుల వల్ల హింస జరుగుతోంది. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్, ట్విట్టర్ ద్వారా వదంతులు ప్రసారమవుతున్నాయి. వీటికి చెక్ పట్టేందుకు ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ వివరాలను కేంద్రహోంమంత్రిత్వశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఈ టెక్నాలజీ ద్వారా మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించి ప్రసారం చేయడం, అశ్లీల దృశ్యాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, నిరాధారమైన సందేశాలను ప్రసారం చేసేవారిని సులువుగా కనిపెట్టవచ్చును. సామాజిక మాద్యమాల ప్రతినిధులతో జరిపిన ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబా చెప్పారు. ఏ1 ఆధారిత టెక్నాలజీ వల్ల చట్టవిరుద్ధమైన సందేశాల ప్రసారాన్ని నిరోధించవచ్చన్నారు. ఇటువంటి సందేశాలను ఆటోమాటిక్‌గా ఈ వేదికల నుంచి తొలగించబడతాయి. పోలీసు ఏజన్సీలు కూడా వదంతులను ప్రసారం చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారన్నారు. సామాజిక మాద్యమాలు కూడా ఫిర్యాదులను పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయన్నారు. ఇటీవల కాలంలో సామాజిక మాద్యమాల వేదికలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఈ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఈ వేదికలను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.