జాతీయ వార్తలు

వేదికపై స్పృహ కోల్పోయిన గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 7: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సభలో స్పృహ కోల్పోయారు. మహారాష్టల్రోని అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాహురిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సభలో పాల్గొన్న గడ్కరీ జాతీయ గీతాలాపన జరుగుతున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రత్యేక దుస్తులు ధరించడం వల్ల 61 సంవత్సరాల గడ్కరీ శరీరానికి సరైన ప్రాణవాయువు(ఆక్సిజన్) సరఫరా కాలేదని, అందువల్లే ఆయన స్పృహ తప్పారని తెలుస్తోంది. కాగా తర్వాత కోలుకున్న గడ్కరీ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమంలో శ్వాసకు సంబందించిన ఇబ్బందులు స్వల్పంగా ఎదురయ్యాయి. ఈ వేదిక సైతం కొంత గాలి ఆడని విధంగా ఉంది. దానికితోడు ఈ ప్రత్యేక వస్త్రాలు సైతం కొంత ఇబ్బందికరంగా అనిపించింది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బాగానే వున్నాను. నాకిప్పుడు రక్తపోటు, మధుమేహానికి సంబందించిన సమస్యలేవీ లేవుఅని విలేఖరులకు చెప్పారు. అంతకుముందు లోసుగర్ సమస్యతో మంత్రి స్వల్పంగా అనారోగ్య సమస్యకు గురయ్యారని వైద్యులు చెప్పిన విషయాన్ని విలేఖరులు మంత్రి దృష్టికి తేగా ‘ఇప్పుడు నేను బాగా కోలుకున్నాను. నా ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్న మీకు కృతజ్ఞతలు’ అని బదులిచ్చారు. ఘటనకు సంబంధించిన ఓ వీడియోలోని దృశ్యాల మేరకు స్నాతకోత్సవంలో గడ్కరీ పక్కన నిలుచున్న గవర్నర్ విద్యాసాగర్ రావు స్పృహ తప్పిన గడ్కరీని పడిపోకుండా పట్టుకున్నారు. వేదికపై ఉన్న సీటులోనే పది నిమిషాలపాటు గడ్గరీ నిస్పృహగా ఉండిపోయారు.

చిత్రం..శిరిడి సాయబాబా ఆలయంలో శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్గరి