జాతీయ వార్తలు

గడువు దాటొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 30లోగా తమతమ నల్లధన ఖాతాలను వెల్లడించాలని లేని పక్షంలో జైలు శిక్ష సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిస్థితిని గ్రహించి నల్లధన ఖాతాలు కలిగిన వ్యక్తులు ఎలాంటి గోప్యత లేకుండా వాటి వివరాలను వెల్లడించి ప్రశాంతంగా నిద్ర పోవాలన్నారు. తనను సన్మానించేందుకు బంగారం వ్యాపారస్తులు శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. బంగారం కొనేందుకు ప్రజలు ఎంత భారీగా ఖర్చుపెడతారో తనను తెలుసునని పేర్కొన్న ఆయన ‘సెప్టెంబర్ 30లోగా నల్లధన వివరాలను వెల్లడించండి..ఇందుకు కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోండి’అని తెలిపారు. పన్నులు ఎగవేసినందుకు గతంలో అనేక మంది జైలుకు వెళ్లారని గుర్తు చేసిన మోదీ ‘మా ప్రభుత్వం కూడా అలాంటి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్త పడండి..గడువులోగా నల్లధన వివరాల్ని నిజాయితీగా వెల్లడించండి’అని ఉద్ఘాటించారు. ‘సెప్టెంబర్ 30 గడువు ముగిసిన తర్వాత అనివార్యంగా తీసుకోవాల్ని చర్యల పాపానికి ఒడిగట్టకూడదనే నేను భావిస్తున్నాను’అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఆదాయ వివరాల వెల్లడి పథకం (ఎస్‌డిఎస్) జూన్ 1న మొదలైంది. సెప్టెంబర్‌లోగా తమ నల్లధన ఖాతాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని నల్లధనం కలిగిన ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చింది. ఈ గడువులోగా తమ ఖాతాల వివరాలు వెల్లడిస్తే ఎలాంటి చర్యలూ ఉండవని, అది దాటితే మాత్రం కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి పదేపదే పత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చింది. ప్యాన్ లేకుండా భారీ ఎత్తున నగదుతో కూడిన 90లక్షలకు పైగాలావాదేవీలు జరిగినట్టుగా ఆదాయం పన్ను అధికారులు ఇప్పటికే గుర్తించారు. పరిశీలనలో భాగంగా ముందుగా ఏడు లక్షల మందికి లావాదేవీల వివరాలు కోరుతూ ఆదాయం పన్ను విభాగం లేఖలు పంపుతుంది.

చిత్రం..ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించి మెమెంటో అందచేస్తున్న బంగారు వ్యాపారస్తులు