జాతీయ వార్తలు

అశ్లీల చిత్రాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: అత్యాచారం, సామూహిక అత్యాచార బాధితులైన పిల్లల చిత్రాలు, వీడియోలను, చైల్డ్ పోర్నోగ్రఫీ (బాలల అశ్లీల చిత్రాలు)ని సంబంధిత వెబ్‌సైట్లలో కాని, ఇతర అప్లికేషన్లలో కాని ప్రదర్శించకుండా వాటిని వెంటనే తొలగించే విషయమై కేంద్ర ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు, ప్రమాణ ప్రక్రియ విధానాన్ని తయారు చేస్తోంది. వీటిని రెండువారాల్లో తొలగించేలా చర్యలు చేపట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం తన చర్యలను ప్రారంభించించినట్టు హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు తమ మంత్రిత్వ శాఖ అధికారులు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి వాటితో సమావేశాలు జరుపుతున్నామని, ద్వేషపూరిత సందేశాలు, హింస, నేరాలు, అత్యాచారాలకు తావిచ్చే చిత్రాలు, సందేశాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాటితో నిరంతరం చర్చలు జరుపుతున్నామని చెప్పారు. తప్పుడు వార్తలను సృష్టించినా, వాటిని ప్రచారం చేసినా, అసభ్య చిత్రాలు, వీడియోలను పంపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవి పంపేవారిని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి ఉపయోగిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీటిని అరికట్టడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని, దీనికి సామాజిక మాధ్యమాలు కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు.