జాతీయ వార్తలు

సరికొత్త సహకార శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: భారత్-ఫ్రాన్స్‌ల మధ్య సరికొత్త సహకార శకానికి తెరలేచింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సయోధ్యతో పనిచేయడం, రక్షణ,రోదసీ, పౌర అణు ఇంధన రంగాల్లో మరింతగా సహకారాన్ని విస్తరించుకోవడానికి సంబంధించి ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. పరస్పర సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా తీసుకెళ్లాలని సంకల్పించా యి. ద్వైపాక్షిక బంధాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఫ్రాన్స్, ఐరోపా విదేశాంగ మంత్రి జీన్ వెస్ లీ డ్రియాన్‌లు విస్తృతంగా చర్చించారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన సుష్మా స్వరాజ్ ‘మా మధ్య అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చలు జరిగాయి. పరస్పర సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేసే అన్ని అంశాలపైనా దృష్టి పెట్టాం’అని తెలిపారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య సహకారం ఎంతగా పెంపొందితే అంతగానూ పరస్పర ప్రయోజనాలు ఒనగూడతాయని, అందుకే ఈ దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు బలోపేతమైతే కేవలం భారత్, ఫ్రాన్స్‌లకే కాకుండా ఇతర దేశాలకూ ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని సుష్మ అన్నారు. పరస్పర విశ్వాస ప్రాతిపదికగానే ఇరు దేశాలూ సహకార పథంలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్న భారత విదేశాంగ మంత్రి ‘ఈ రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే సంయుక్తంగా సైనిక విన్యాసాలు ఎన్నో సార్లు నిర్వహించాం.
సైనిక శిక్షణ పేరిట పరస్పరం సైనిక పాటవానికి పదును పెట్టుకుంటున్నాం’అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద నిరోధన దిశగా కూడా ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని చెప్పారు. అలాగే రోదసీ రంగానికి సంబంధించి కూడా కలిసి పని చేస్తున్నామని, ఎప్పటికప్పుడు ఈ సహకారం కొత్త పుంతలు తొక్కుతోందని సుష్మ తెలిపారు. అలాగే వాణిజ్యపరంగానూ గత కొన్ని సంవత్సరాలుగా పురోగతి కనిపిస్తోందని, 2020నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 15మిలియన్ యూరోలకు పెంచే దిశగా కృషి చేస్తున్నామన్నారు. మహారాష్టల్రోని జైతాపూర్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన యూరోపియన్ ప్రెషరైజ్‌డ్ రియాక్టర్ (ఇపిఆర్) ప్రాజెక్టు నిర్మాణాన్ని సమీక్షించామని, దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి డ్రియాన్ తెలిపారు. సంకల్పించిన ఆరు ఇపిఆర్ ప్రాజెక్టులు పూర్తయితే పది గీగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సంతరించుకోవడం సాధ్యమవుతుందన్నారు.
చిత్రం..శనివారం సంయుక్త ప్రకటన అనంతరం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి డ్రియాన్‌తో
కరచాలనం చేస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్