జాతీయ వార్తలు

చిన్న వర్శిటీలకు విడిగా ర్యాంకింగ్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పానాజీ, డిసెంబర్ 15: దేశంలో చిన్న విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ప్రత్యేక ర్యాంకింగ్ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. డిటెన్షన్ విధానం లేనందు వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టుపడుతుందన్నారు. ప్రాథమిక విద్యా వ్యవస్థలో లెర్నింగ్ మాడ్యూల్స్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. శనివారం ఇక్కడ గోవా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో విద్యా రంగానికి కొత్తగా దిశ, దశ మార్గనిర్దేశనం చేసిన ఘనత ఎన్డీఏ సర్కార్‌కు దక్కుతుందన్నారు. విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో సహా పలువురు ఆర్థిక వేత్తలు విద్యా రంగంలో తేవాల్సిన మార్పులపై విధానపత్రం ఇచ్చారన్నారు. విద్యా వ్యవస్థ దేశాభివృద్ధికి ఉపయోగపడేవిధంగా ఉండాలన్నారు. విద్యాలయాల్లో అద్భుతమైన వౌలిక సదుపాయాలు ఉండడమే పరిష్కారం కాదన్నారు. ఈ వౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే విధంగా మానరులు ఉండాలన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుతున్నామన్నారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచాలని, వారికి సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియచేసే నైపుణ్యాన్ని మెరుగుపరచాలన్నారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి ఈ రంగంలో గణనీయమైన మార్పులు తేవాలని తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎనిమిదవ తరగతి వరకు పరీక్షలు ఉండకూడదనే విద్యా విధానం మంచిదికాదన్నారు. దీని వల్ల విద్యా రంగం కుప్పకూలుతుందన్నారు. డిటెన్షన్ పాలసీ లేనందు వల్ల విద్యా రంగంలో ఆశించిన సత్ఫలితాలు రావడంలేదని రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తెస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పదివేల మంది గోవా వర్శిటీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.