జాతీయ వార్తలు

రాఫెల్ తీర్పును సుప్రీంకోర్టు వెనక్కుతీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: రాఫెల్ ఫైటర్ జెట్స్ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వెనక్కుతీసుకుని కేంద్రప్రభుత్వానికి కోర్టు ధిక్కారం కింద నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమండ్ చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తగిన చర్యలను కేంద్రంపై తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత ఆనందశర్మ కవరారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాఫెల్ అంశంపై కాగ్ నివేదికను పార్లమెంటుకు ఇచ్చినట్లు పేర్కొన్ని సభాహక్కుల ఉల్లంఘనకు బీజేపీ పాల్పడిందన్నారు. కాగ్ నివేదిక ఇవ్వలేదని , పీఏసీకి వివరాలు కూడా ఇవ్వలేదని ఆయనచెప్పారు. సుప్రీంకోర్టు వెంటనే తీర్పును వెనక్కుతీసుకుని, గతంలో ఇచ్చిన తీర్పు చెల్లదని పేర్కొనాలని కోరారు. ఈ విధంగా చేయడం వల్ల కోర్టు గౌరవం పెరుగుతుందన్నారు. తప్పుదోవబట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం నేరమని ఆయన అన్నారు. రాఫెల్ లాంటి అంశాలపై కోర్టు విచారణ జరపలేదని తమ అభిప్రాయమని ఆయన చెప్పారు. కాగ్‌ను కలిసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని గతంలో కాంగ్రెస్ కోరినట్లు ఆయన చెప్పారు.
పార్లమెంటుకు కాగ్ నివేదిక ఇవ్వడం చట్టబద్ధమన్నారు. కాని తాజా పరిణామాలు చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతోందన్నారు. వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. దీని వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు.