జాతీయ వార్తలు

వేర్పాటువాదుల మాటలను లెక్కచేయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 16: పుల్వామా జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించిన ఏడుగురు పౌరులు మృతి చెందినందుకు నిరసనగా కాశ్మీర్‌లో వేర్పాటువాదులు ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముట్టడించే కార్యక్రమంలో పాల్గొనరాదని, ర్యాలీకి ప్రజలు హాజరు కావద్దని ఆర్మీ విజ్ఞప్తి చేసింది. బాదామీ బాగ్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి జేఆర్‌ఎల్ ఆధ్వర్యంలో సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మాలిక్‌లు పిలుపునిచ్చారు. పుల్వామా ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ జేఆర్‌ఎల్ ఇచ్చిన పిలుపును పట్టించుకోవద్దని కోరారు. కాశ్మీర్ ప్రజలకు అండగా సైనికులు ఉంటారన్నారు. ఉగ్రవాదుల మద్దతుతో శాంతిని భగ్నం చేసేందుకు కొంత మంది పన్నాగం పన్నుతున్నారన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఆర్మీ రాజీలేన పోరు చేస్తోందన్నారు. పాకిస్తాన్ కుట్రలో భాగస్వాములు కారాదని ప్రజలను ఆర్మీ ప్రతినిధి కోరారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు అనేక హింసాత్మక ఘటనకు బాధ్యులన్నారు. అమాయకులైన కాశ్మీరీ ప్రజలపై మారణహోమం సాగించరాన్నారు. పౌరులు మరణించకుండా ఆర్మీ అన్ని చర్యలు తీసుకున్నా, ఒక్కోసారి విచారకరమైన పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయన్నారు. పౌరులు మరణించడం బాధాకరమైన విషయమన్నరు. దీనిని దేశ వ్యతిరేకులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.