జాతీయ వార్తలు

ఓఎన్జీసీ ఒలిండా స్టార్ రిగ్ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 22: పెథాయ్ తుపాను కారణంగా దెబ్బతిన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు ఆన్‌షోర్‌లో డ్రిల్లింగ్ నిర్వహించే ఒలిండా స్టార్ రిగ్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు ఓఎన్జీసీ ఉన్నతాధికారులు శనివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సంస్థ అంతర్జాతీయ నిపుణులు, ఓఎన్జీసీ నిపుణులు బృందం సంయుక్తంగా రిగ్‌ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఈస్ట్‌కోస్టు ఓఎన్జీసీ కార్యక్రలాపాల కోసం ఒలిండాస్టార్ రిగ్‌ను ఏర్పాటుచేసినట్లు వారు చెప్పారు. వాతావరణ శాఖ పెథాయ్ తుపాను హెచ్చరికలు చేసిన అనంతరం ఈనెల 14, 15తేదీలలో ఒలిండాస్టార్ రిగ్‌లో పనిచేస్తున్న 111 మంది సిబ్బందిని తీరానికి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. రిగ్‌లో పనిచేసే సిబ్బందిని హెలీకాఫ్టర్లు, పడవుల ద్వారా తరలించడానికి ఓఎన్జీసీ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసి వారిని సకాలంలో సురక్షితంగా తీరానికి తరలిచినట్లు చెప్పారు. తుపాను ప్రభావంతో రిగ్ దెబ్బతినడంతో భారత నావికాదళం హెలీకాఫ్టర్లను అంతర్జాతీయ నిపుణులు, ఓఎన్జీసీ నిపుణులను ఒలిండాస్టార్ రిగ్‌కు తరలించేందుకు ఉపయోగించామని వారు పేర్కొన్నారు. నిపుణుల బృందంతో పాటు 12మంది సిబ్బంది ఈనెల 21వ తేదీ ఉదయం రిగ్‌లోకి ప్రవేశించి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి రిగ్‌ను మరలా యధాస్థితికి తీసుకువచ్చినట్లు వివరించారు.
ఈ ఆపరేషన్ కార్యక్రమంలో ఓఎన్జీసీ సీఎండి శశిశంకర్‌తో సహా ఉన్నతస్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారని వారు పేర్కొన్నారు. రిగ్ యధాస్థితికి తీసుకువచ్చిన తరువాత పూర్తిస్థాయిలో తనీఖీచేయగా పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నట్లు నిపుణులు నిర్ధారించారన్నారు. రిగ్‌ను పునరుద్ధరించి బ్యాలస్టింగ్ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించామని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రిగ్ పనితీరు ప్రోత్సాహకరంగా ఉందని, రిగ్‌కు చెందిన ప్రధాన జనరేటర్లు పనిచేస్తున్నాయని, ఇతర పరికరాలు డ్రిల్లింగ్ కార్యకలాపాలకు అనువుగా ఉన్నట్లు నిపుణుల బృందం ద్రువీకరించిందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. రికార్డు సమయంలో అంతర్జాతీయ నిపుణులను త్వరగా ఆఫ్‌షోర్‌కు తీసుకువచ్చి రిగ్‌ను త్వరగా డ్రిల్లింగ్ చేసేందుకు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఒలిండా స్టార్ రిగ్ అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులకు ఈస్ట్‌కోస్ట్‌లో లోతైన నీటిలో పనిచేసేందుకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా ఏర్పాటుచేసిన సెమిసిబేర్బెర్రీస్ డ్రిల్లింగ్ రిగ్‌గా పేర్కొన్నారు. ఈ రిగ్ అన్ని రకాల అంతర్జాతీయ చట్టపరమైన, నియంత్రణ సంస్థలచే ఒఐఎస్‌డి వంటి జాతీయ భద్రతా నియంత్రణాధికారులతో పూర్తిగా సర్ట్ఫికెట్ పొందిందన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఈస్ట్‌కోస్ట్‌లో ఒలిండాస్టార్ రిగ్ ద్వారా ఓఎన్జీసీ సంస్థ డ్రిల్లింగ్ చేస్తుందని సంస్థ అధికారులు విడుదలచేసిన ప్రకటనలో తెలియజేశారు.