జాతీయ వార్తలు

మళ్లీ ప్రశ్నోత్తరాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తెలుగుదేశం, అన్నా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులు చేసిన గొడవ కారణంగా శుక్రవారం కూడా లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగలేదు. మూడు పార్టీల సభ్యులు పోడియాన్ని చుట్టు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణ పూరిత వాతావరణంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొట్టుకుపోయింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దర్యాపు జరిపేందుకు జేపీసీని నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, తెలుగుదేశం సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై చేపట్టిన మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ అన్నా డీఎంకే సభ్యులు గొడవ చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రశ్తోత్తరాల కార్యక్రమం చేపట్టిన వెంటనే, మూడు పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. సుమిత్రా మహాజన్ మూడు పార్టీల సభ్యుల గొడవ, గందరగోళం మధ్య రెండు ప్రశ్నలపై చర్చ పూర్తి చేశారు. అయితే గొడవ మరింత పెరగటంతో లోక్‌సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేయకతప్పలేదు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైనప్పుడు కూడా మూడు పార్టీల సభ్యులు గొడవను కొనసాగించా రు. అయితే, సుమిత్రా మహాజన్ వారి నిరసనలను ఏమాత్రం పట్టించుకోకుండా, ముందు నిర్ణయించిన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించే కార్యక్రమం ముగిసిన అనంతరం, జీరో అవర్‌లో ఆమె పలువురు సభ్యులకు తమతమ నియోజకవర్గాల సమస్యల ను సభ దృష్టికి తెచ్చేందుకు అవకాశం ఇచ్చారు. లోక్‌సభ భోజన విరామ సమయం తరువాత ప్రైవేట్ మెంబర్ల తీర్మానాలను సభకు సమర్పింపజేశారు.
రాజ్యసభ పది నిమిషాలు
అన్నా డీఎంకే, ఇతర ప్రతిపక్షం సభ్యులు చేసిన గొడవ మూలంగా రాజ్యసభ ఈరోజు కూడా కేవలం పది నిమిషాల పాటు పని చేసిన అనంతరం సోమవారానికి వాయిదా పడింది. రాజ్యాసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే, మొదట అధికార పత్రాల సమర్పణ కార్యక్రమం పూర్తి చేశారు.
ఆ తరువాత జీరో అవర్ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అన్నా డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ సీట్లలోనిలబడి గొడవ చేశారు. సభ్యులను శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో వెంకయ్య నాయుడు రాజ్యసభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఏపీపై కేంద్రం వివక్ష తెలుగుదేశం ఎంపీల ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పార్లమెంట్‌లో తమ ఆందోళనను శుక్రవారం కూడా కోనసాగించారు. పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై అన్ని విధాలుగా వివక్ష చూపుతోందని ఆరోపించారు. చంద్రబాబునాయుడును తొక్కేయడానికి బీజేపీ శత విధాలుగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అయితే, ఆయనను ఎవరూ, ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రధాని నీతినిజాయితో వ్యవహరించి, ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో వినూత్న వేషధారణతో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం శివుడి వేషధారణలో ఆందోళన వ్యక్తం చేశారు.