జాతీయ వార్తలు

అంతరిక్షంలో స్వైర విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరిక్ష పరిశోధనలో అగ్ర దేశాలకు దీటుగా భారత్ తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటుంది. ఘచిన్నడుగులతో మొదలైన అంతరిక్ష ప్రయాణం అనన్య సామాన్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నో ఎనె్నన్నో రోదసీ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడమేకాకుండా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను సైతం అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన ఇస్రో తన ఘనతను విశ్వ విఖ్యాతం చేసుకుంది. ఆర్యభట్టతో మొదలైన ఈ రోదసీ ప్రయాణం మరికొన్ని సంవత్సరాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు అప్రతిహతంగా సాగుతోంది. ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనలో ఎన్నో అద్భుతాలు సాధించిన సంపన్న దేశాలు సైతం విస్మయం చెందేలా తొలి చంద్రయాన్ ప్రయోగాన్ని తాజాగా మార్స్ రోవర్ ప్రయోగాన్ని కూడా ఇస్రో విజయవంతం చేసింది. ప్రతి ఏడాదిలోనూ రోదసీ ప్రయోగంలో కొత్త పుంతలు తొక్కుతూ భారతదేశానికి అన్ని విధాలుగా సాంకేతిక ఊతాన్నిస్తున్న ఇస్రో 2018లో ఎన్నో అద్భుతమైన విజయాలను సాకారం చేసుకుంది. ఇతర దేశాలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుని వాణిజ్య పరంగా కూడా అంతరిక్ష ప్రయోగాలను మరింత సుసంపన్నం చేసుకోబోతోంది. ఈ ఏడాదిలో ఇస్రో సాధించిన విజయాలు కొత్త సంవత్సరంలో కూడా ఎన్నో అద్భుతాలను కరతలామలకం చేయగలమన్న ధీమా సర్వత్రా వ్యక్తం అవుతోంది. మొత్తం ఐదు రోదసీ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం ద్వారా మరింత ఆత్మ విశ్వాసాన్ని సంతరించుకున్న ఇస్రో ద్విగుణీకృతోత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడగుపెట్టబోతోంది.

ఒకేసారి 30 ఉపగ్రహాల ప్రయోగం
సాంకేతికంగా ఎంత పరిజ్ఞానం ఉన్నా, రోదసీ పరిశోధనలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న దేశాలు సైతం అబ్బురపడే రీతిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పీఎస్‌ఎల్వీ సి-43ని ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా విదేశాలకు చెందిన 30 వాణిజ్య ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. ఈ ప్రయోగం ఏ విధంగా చూసినా అంతరిక్ష పరిశోధనలో ఎంతో కీలకమైనదే. ఐసీస్ అనే ఉపగ్రహం ఔటర్ స్పేస్‌లో వున్న వాటిని గుర్తించి అనుపానులను అందించగలుగుతుంది. ఈ ప్రయోగ విజయం ద్వారా అంతకుముందు వరకు ప్రయోగించిన వాటిని కలుపుకొని 28దేశాలకు చెందిన మొత్తం 270 ఉపగ్రహాలను ఇస్రో రోదసీలోకి పంపింది. ఇది ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించలేని విజయం.

కమ్యూనికేషన్‌లో
కొత్త పుంతలు

ఇతర దేశాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడమే గాకుండా ఎప్పటికప్పుడు దేశీయంగా పెరుగుతున్న అవసరాలను సైతం తీర్చడంలో ఇస్రో క్రియాశీలక భూమికను పోషిస్తూనే వచ్చింది. ఇందులో భాగంగా జీ-శాట్ 29 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ద్వారా కమ్యూనికేషన్ల పరంగా సరికొత్త పుంతలు తొక్కింది. జీశాట్-29 అనే ఉపగ్రహం ఇటు జమ్మూ కాశ్మీర్, అటు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల అవసరాలను తీర్చడానికే ఉద్దేశించింది కావడం గమనార్హం. డిజిటల్ టెక్నాలజీని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలన్న ఆలోచనే ఈ ప్రయోగానికి కారణమైంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన కేఏ/కేయూ బ్యాండ్ అత్యంత శక్తివంతమైనది. ఈ ట్రాన్స్ పౌండర్‌లు దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల కమ్యూనికేషన్ అవసరాలను మరింతగా తీర్చే అవకాశం ఉంటుంది.

కనెక్టివిటీకి బలిమి
భారత దేశంలో కనెక్టివిటీ అన్నది పెరుగుతున్న జనావసరాల దృష్ట్యా ఎంతో ముఖ్యం. గతంతో పోలిస్తే అత్యంత జన బాహుళ్యం కలిగిన భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ అవసరాన్ని తీర్చుకోవడంతోపాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకూని ఇస్రో చేసిన ప్రయోగం జీశాట్-2 అంతకుముందు వరకు ప్రయోగించిన ఉపగ్రహాలతో పోలిస్తే ఇది అత్యంత భారీ ఉపగ్రహం. ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా ఈ ప్రయోగ విజయాన్ని ఇస్రో సాధించింది. జీశాట్-2 ఉపగ్రహం ద్వారా దేశ వ్యాప్తంగా 16 జీబీపీఎస్ డేటా అనుసంధానంతో ఇస్రో అందించగలుగుతుంది.

ఎయిర్‌ఫోర్స్‌కు
వెన్ను దన్ను
ఈ ఏడాది డిసెంబర్ 19న ఇస్రో ప్రయోగించిన జీశాట్-7ఏ ఉపగ్రహం సైనిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించినది. పూర్తిగా భారత వైమానిక దళ అవసరాలను తీర్చడంతో పాటు దీనికి మరింత శక్తిని, పుష్టిని ఈ ఉపగ్రహం అందించగలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత శక్తి వంతమైన వైమానిక దళాలకు దీటుగా భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ ఉపగగ్రహం అత్యంత క్రియాశీలకం కాబోతోంది. దీనివల్ల అనేక రకాలుగా ఎయిర్‌ఫోర్స్ బలోపేతం కావడంతో పాటు అది ప్రయోగించే అన్‌మ్యాండ్ ఏరియల్ వాహకాలను, డ్రోన్‌లను పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.