జాతీయ వార్తలు

ఇది మీ చేతకానితనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుపై రాజకీయ లబ్ధికోసం కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు కావాలని కొన్ని రోజులుగా న్యాయ శాఖ కార్యదర్శి చుట్టూ తిరిగిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం తగదన్నారు. ఢిల్లీలో జీవీఎల్ విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటును స్వాగతించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుని ఈ అంశాన్ని మోసపూరిత రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని అన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ ఏపీలో పర్యటించినప్పుడు హైకోర్టు పనులు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తుచేశారు. గత జనవరి నెలలో హైకోర్టు నిర్మాణాన్ని ఏడు నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, డిసెంబర్ నెలఖారునాటికి పూర్తి చేస్తామని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లోనూ ఏపీ ప్రభుత్వం పేర్కొన్నదని ఆయన చెప్పారు. హైకోర్టు ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా చంద్రబాబు ఇప్పుడు సుప్రీం కోర్టు, హైకోర్టులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు నిర్మాణం విషయంలోనూ చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు.