జాతీయ వార్తలు

సవరణలు చేయాల్సిందే : సుజనా చౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: రాజ్యసభలో కేంద్రం ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లులోని కొన్ని అంశాలకు సవరణలు చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి మాట్లాడుతూ తలాక్ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, ఆ బిల్లును సవరించాల్సిందేనని తెగేసి చెప్పారు. ఈ బిల్లును రాజ్యసభలో చాలాపార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో బలవంతంగా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందని, రాజ్యసభలో బిల్లుకు ఆమోదం తెలిపేముందు అందులోని కొన్ని అంశాలకు సవరణలు చేయాలని అన్నారు. ఆ సవరణలు చేయనిపక్షంలో దీన్ని అడ్డుకుని తీరుతామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. లోక్‌సభ సభ్యుడు కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికి ఆ మతంలోని పురుషులకు అన్యాయం చేయవద్దని కేంద్రానికి సూచించారు. స్ర్తి పురుషులకు సమాన న్యాయం జరిగేలా బిల్లు ఉండాలని కేంద్రాన్ని కోరారు. ఈ బిల్లును చట్టం చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ ఈ బిల్లును చట్టం చేసే ముందు ముస్లిం దేశాలలో ఆయా చట్టాలను క్షుణంగా పరశీలించాకే బిల్లుకు రాజ్యసభలో ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.