జాతీయ వార్తలు

ప్రత్యేక రైల్వే జోన్ ఏమైంది? : అవంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీనివాస్ సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామంటూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోరా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్, వాల్తేర్ డివిజన్లతో ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మాట మరిచారా అని ఆయన వ్యంగ్య బాణాలు విసిరారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని గత పదేళ్లనుండి డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవటం సిగ్గుచేటని శ్రీనివాస్ విమర్శించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ నుండి అత్యధిక ఆదాయం వస్తోంది, వాల్తేర్ డివిజన్ నుండి రూ.6,280 కోట్ల ఆదాయం ఈస్ట్‌కోస్ట్ డివిజన్‌కు వస్తోందని ఆయన చెప్పారు. విశాఖపట్నానికి సహజసిద్ధ ప్రయోజనాలున్నాయి.. ఇక్కడ రెండు పెద్ద ఓడరేవులున్నాయి. అతిపెద్ద భూబ్యాంకు ఉన్న ది. వీటితోపాటు ఇక్కడ అతిపెద్ద లోకోషెడ్, నాణ్యమైన కోచ్ నిర్వహణ డిపో ఉన్నాయని అవంతి శ్రీనివాస్ వివరించారు. ఆసియా మొత్తంమీద అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగరంలో తూర్పు నావికాదళ కేంద్రం, ఎన్‌ఎస్‌టీఎల్, బీహెచ్‌ఈఎల్, బార్క్, హెచ్‌పీసీఎల్ రిఫైనరీ, హిందుజా విద్యుత్ కేంద్రం ఉన్నాయి. వీటితోపాటు ప్రస్తుత వాల్తేర్ డివిజన్‌లో వైద్య, విద్య, క్రీడా సౌకర్యాలు, వౌళిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు.