జాతీయ వార్తలు

ఎవరినీ ప్రలోభ పెట్టడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 31: కర్నాటకలో అధికారంలో ఉన్న జేడీ (ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి తమ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప ఖండించారు. సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొందరు నేతలను బీజేపీ ప్రలోభపెడుతోందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని, ఆ రెండుపార్టీల మధ్య ఉన్న పొత్తు దానికదే విచ్ఛిన్నమవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ 25 నుంచి 30 కోట్ల రూపాయలు ముట్టచెబుతామని బీజేపీ బేరసారాలు ఆడుతోందని, అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోందని ఆదివారం సిద్ధరామయ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన యెడ్యూరప్ప ‘ఆయన (సిద్ధరామయ్య) నిత్యం ఇలాంటి అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మేము మళ్లీమళ్లీ చెబుతున్నాం.. కర్నాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం మాకు లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏమన్నా సాక్ష్యాలు ఉంటే వెంటనే వాటిని చూపాలని డిమాండ్ చేశారు. స్థాయిని దిగజార్చుకుని ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని యెడ్యూరప్ప హితవు పలికారు. ప్రస్తుత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉందని, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం సం తృప్తిగా లేరని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ ప్రయత్నం చేయనక్కరలేదని పేర్కొన్నారు. ఏదిఏమైనా బీజేపీ జోక్యం లేకుండానే వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందే పెనుమార్పు జరగవచ్చునని జోస్యం చెప్పారు. అసంతృప్త ఎమ్మె ల్యే రమే ష్ జార్కిహోలి సహా కాంగ్రెస్‌తో గాని, జేడీ (యూ) పార్టీ ఎమ్మెల్యేలతో గాని తాము ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని యెడ్యూరప్ప స్పష్టం చే శారు. సంకీర్ణ ప్రభుత్వం విచ్ఛిన్నమైతే బీజేపీ అధికారం చేపడుతుందా? అన్న ప్రశ్నకు ‘అవకాశమిస్తే అధికారం చేపట్టకుండా ఉండటానికి మా ఎమ్మెల్యేలేమీ సన్యాసులు కాదు’ అని యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు.