జాతీయ వార్తలు

రాజ్యసభలో ‘తలాక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలు పరిరక్షించేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ప్రతిపక్షం మెజారిటీలో ఉన్న రాజ్యసభలో చుక్కెదురైంది. ట్రిపుల్ తలాక్ బిల్లును చేపట్టి చర్చ జరపకుండానే రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించేందుకు కూడా ప్రతిపక్షం సభ్యులు ససేమిరా అంగీకరించలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును నేరుగా రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ తాము ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ జరపాలని ప్రతిపక్షం నాయడు గులాం నబీ ఆజాద్, టీఎంసీ నాయకుడు డెరిక్ ఓబ్రేన్ డిమాండ్ చేశారు. లోక్‌సభ ఆమోదించిన సవరించిన ట్రిపుల్ తలాక్ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ప్రయత్నించినప్పుడు ప్రతిపక్షం దానిని కలిసికట్టుగా ప్రతిఘటించింది. ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ, తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు డెరిక్ ఓబ్రేన్, పలువురు ఇతర సభ్యులు ట్రిపుల్ తలాక్ బిల్లును గట్టిగా వ్యతిరేకించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే సంప్రదాయాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని గులాం నబీ ఆజాద్ తదితరులు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను పట్టించుకోకుండా ట్రిపుల్ తలాక్ బిల్లును బలవంతంగా ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనితో సభలో గొడవ జరిగింది. అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్దకు వచ్చి కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై చేపట్టిన మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ఇచ్చారు. దీనితో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను పదిహేను నిమిషాలపాటు వాయిదా వేశారు. ఈ సమయంలో హరివంశ్ సింగ్ వివిధ పక్షాల నాయకులతో తన చాంబర్‌లో సమావేశమై సభను సజావుగా కొనసాగించే అంశంపై చర్చించారు. సభ తిరిగి సమావేశం కాగానే రవి శంకర్ ప్రసాద్ మరోసారి ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించేందుకు ప్రయత్నించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరిక్ ఓబ్రేన్ లేచి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ తాను ప్రతిపాదించిన తీర్మానం ఏమైందని ప్రశ్నించారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ సవరించిన ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గోయల్ స్పందిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ గులాం నబీ ఆజాద్ ప్రతిపాదించిన తీర్మానమేదీ ప్రభుత్వం వద్ద లేదన్నారు. గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ టీఎంసీ నాయకుడు డెరిక్ ఓబ్రేన్ ప్రతిపాదించిన తీర్మానం ప్రతిపక్షం తీర్మానం కాదా? అని విజయ్ గోయల్‌ను నిలదీశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న ప్రతిపక్షం డిమాండ్‌ను విజయ్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షం దురుద్దేశ్యంతో ఈ బిల్లును అడ్టుకుంటోంది.. బిల్లును ఆమోదించడం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సంబంధించిన బిల్లును ప్రతిపక్షం సమర్థించాల్సిందిపోయి వ్యతిరేకించటం ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. దీనికి గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ బిల్లును తాము వ్యతిరేకించటం లేదు.. బిల్లుపై కూలంకషంగా చర్చ జరిపేందుకు దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించాలని అడుగుతున్నామని వివరించారు. బిల్లు ఇదివరకే సెలెక్ట్ కమిటీకి వెళ్లివచ్చింది.. గత సెలెక్ట్ కమిటీ చేసిన సిఫారసులను బిల్లులో పొందుపరిచి సవరించిన బిల్లును మొదట లోక్‌సభలో ప్రతిపాదించాం.. లోక్‌సభ ఆమోదం లభించిన తరువాతనే రాజ్యసభకు తెస్తున్నామని గోయల్ వివరించారు. అయితే ప్రతిపక్షం ఈ వాదనతో ఏకీభవించలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును మొదట రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించవలసిదేనని గులాం నబీ ఆజాద్, డెరిక్ ఓబ్రేన్ స్పష్టం చేశారు. మొత్తం ప్రతిపక్షమంతా ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేస్తోందని గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో అధికార, విపక్షాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఈ గందరగోళంతో డిప్యూటీ చైర్మన్ సభను బుధవారం ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. నూతన సంవత్సరం మూలంగా రాజ్యసభకు మంగళవారం సెలవు ప్రకటించారు.