జాతీయ వార్తలు

రైతును ఆకట్టుకునేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశ వ్యాప్తంగా రైతాంగంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి సత్వర ప్రాతిపదికన మేలు కలిగించేందుకు మూడు అంశాలను కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్షోభంలో పడ్డ రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరి మద్దతును విశేషంగా చూరగొనే లక్ష్యంతోనే ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. వీటిలో మొదటిది రైతులకు నెలవారీ ఆదాయాన్ని కల్పించడం, రెండోది పంటల వాస్తవ అమ్మకం ధర ప్రభుత్వ సేకరణ ధరకు మధ్య ఉండే తేడాను భర్తీ చేయడం, మూడోది బీమాను రైతాంగానికి మరింత ప్రయోజనం కలిగేలా తీర్చిదిద్దడం. ప్రభుత్వం అంతిమంగా తీసుకునే నిర్ణయం ఈ మూడింటి మేలుకలయికగానో లేదా వీటిలో ఏదో ఒకటిగానో ఉండవచ్చునని అభిజ్ఞ వర్గాల కథనం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో రైతులకు నేరుగా నగదు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అత్యవసర ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టే అంశంపై ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. ఆదాయ మద్దతు పథకంలో భాగంగా నెల వారీగా రైతులకు కొంత మొత్తాన్ని అందించవచ్చునని, దీని వల్ల 150 మిలియన్ల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే దేశంలోని రైతుల మద్దతును గణనీయంగా పొందడం అత్యంత కీలకమన్న భావనతోనే బీజేపీ నాయకత్వం ముందుకు సాగుతోంది. అంచనా ఉత్పాదక వ్యయం కంటే 50 శాతం ఎక్కువ మొత్తాన్ని రైతులకు లభించే విధంగా పత్తి, సోయాబీన్, వరి మద్దతు ధర ను కేంద్రం గత జూలై నెల్లో పెంచింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతు లభించక పోవడంతో రైతులు అందినకాడికి ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.