జాతీయ వార్తలు

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా సుధీర్ భార్గవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా సుధీర్ భార్గవను కేంద్రం నియమించింది. ఆయనతోపాటు నలుగురు కమిషనర్లను కూడా నియమించారు. భార్గవ ప్రస్తుతం ఇన్ఫర్మేషన్‌ను కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనితో ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో సభ్యుల సంఖ్య 11కు చేరింది. ఈ నియామకాలకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఆమోదముద్ర వేశారు. నలుగురు కమిషనర్లలో యశ్వర్థన్ కుమార్ సిన్హా (ఐఎఫ్‌ఎస్), వనజా ఎన్.శర్నా (మాజీ ఐఆర్‌ఎస్), నీరజ్ కుమార్ గుప్తా (మాజీ ఐఏఎస్), సురేష్ చంద్ర (మాజీ లా సెక్రటరీ) ఉన్నారు. యశ్వర్థన్ కుమార్ సిన్హా 1981 బ్యాక్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వహించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో అనేక కీలక పదవుల్లో పనిచేశారు. కమిషనర్లలో ఒకే ఒక మహిళ వనజా ఎన్.శర్నా. 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారిణి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ చీఫ్‌గా విధులు నిర్వహించారు. 1982 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్. ఇనె్వస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగంలో కార్యదర్శిగా విధులు నిర్వహించారు. సురేష్ చంద్ర ఇండియన్ లీగల్ సర్వీస్ అధికారిగా 2002-2004లో విధులు నిర్వహించారు. న్యాయ శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ వద్ద కార్యదర్శి హోదాలో పనిచేశారు. వీరంతా ఈ ఏడాదిలోనే రిటైరయ్యారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా పనిచేసిన ఆర్.కే.మాథుర్‌తోపాటు కమిషనర్లు యశోవర్థన్ ఆజాద్, శ్రీ్ధర్ ఆచార్యులు, అమితవ భట్టాచార్య ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయితే వీరి నియాకాల్లో ఆలస్యం జరుగుతుడడంతో ఈ ఖాళీలను భర్తీచేయాలని కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలు సుప్రీంను ఆశ్రయించారు. వీరి నియామకాలు వెంటనే జరపరడంతోపాటు పారదర్శకత పాటించాలని సుప్రీం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.