జాతీయ వార్తలు

మహారాష్టక్రే ఐఎన్‌ఎస్ విరాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: నౌక దళం సేవల నుంచి ఉపసంహరించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్ ఆంధ్రప్రదేశ్ చేజారిపోయింది. విరాట్ తమ రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. రూ.850 కోట్లు వెచ్చించి ఐఎన్‌ఎస్ విరాట్‌ను హోటల్, మ్యూజియంగా మార్చడానికి ఆసక్త కనబరుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపిన విషయం వాస్తవమేనా.. అదే నిజమైన ప్రతిపాదనకు సంపాదించిన వివరాలు ఏమిటని రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
విశాఖ-రాజమండ్రి టోల్ వసూళ్లు రూ.1775కోట్లు
విశాఖపట్నం-రాజమండ్రి మధ్య జాతీయ రహదారిపై ఉన్న మూడు ప్రధాన టోల్‌గేట్ల నుంచి ఇప్పటివరకు రూ.1775 కోట్ల టోల్ వసూలు చేసినట్లు ఉపరతల రవాణా శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సొమవారం రాజ్యసభలో తెలిపారు.