జాతీయ వార్తలు

లోక్‌సభకు పోటీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 1: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ట్వీట్ ద్వారా తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేస్తూ, ప్రజల మద్దతుతో తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. బెంగళూరుకు చెందిన ప్రకాశ్‌రాజ్ చాలా రోజుల నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కేంద్రంలో బీజేపీ సర్కార్‌పై ఆయన అనేకసార్లు విమర్శలు చేశారు. బెంగళూరులో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన గౌరీ లంకేష్ అనే జర్నలిస్టుకు గట్టి మద్దతుదారులు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను అరెస్టు చేయాలని ప్రకాశ్ రాజ్ అనేక వేదికల తర్వాత డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీని విమర్శించినందుకు తనకు బాలీవుడ్ దర్శకులు పాత్రలు ఇవ్వడం మానివేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల కాలంలో దక్షిణాదిన సినీ పరిశ్రమ నుంచి కమల్ హసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లో చేరిన విషయం విదితమే.