జాతీయ వార్తలు

ఆయుష్మాన్‌కు స్పందన అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకానికి విశేష స్పందన వస్తోందని, ఈ స్కీంను ప్రవేశపెట్టిన తొలి వంద రోజుల్లో 6.85 లక్షల పేద ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జాతీయ ఆరోగ్య విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రతి రోజూ ఐదు వేల క్లైమ్స్‌ను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ స్కీం గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన ప్రవేశపెట్టామన్నారు. ఈ స్కీం గురించి ప్రజల్లో చైతన్యం పెరిగిన తర్వాత దాదాపు కోటి మంది వరకు వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16వేల కుటుంబాలు ఈ స్కీం పరిధిలో ఉన్నాయన్నారు. మొదటి వంద రోజుల్లో 6.85 లక్షల రోగులకు 5.1 లక్షల క్లైమ్స్ ఇచ్చామన్నారు. దీని కింద ఆసుపత్రులకు సొమ్ము చెల్లించేసినట్లు చెప్పారు. ఈ స్కీం కింద సాలీనా ఒక కుటుంబానికి రూ.5 లక్షల కవరేజి ఉంటుందన్నారు. 10.74 కోట్ల పేద కుటుంబాలు, 50 కోట్ల మంది ప్రజలను ఈ స్కీం పరిధిలోకి తేవాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ ఉద్యోగులకు బీమా సదుపాయం ఉందని, 62.58 శాతం జనాభాకు సరిగా వైద్యసదుపాయాలు అందడం లేదన్నారు.