జాతీయ వార్తలు

అన్నాడీఎంకే సభ్యుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: లోక్‌సభలో గత నెల ఎనిమిదో తేదీనుండి పోడియం వద్ద గొడవ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న 24 మంది అన్నాడీఎంకే సభ్యులను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదు రోజుల పాటు సభనుండి సస్పెండ్ చేశారు. బుధవారం ఉదయం నుండీ పోడియం వద్ద నిలబడి కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై నిర్మిస్తున్న మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అన్నాడీఎంకే సభ్యులు పెద్దఎత్తున నినాదాలిచ్చారు. ఇద్దరు సభ్యులు ఏకంగా సీట్లపై నిలబడి హంగామా సృష్టించారు. మరి కొందరు కాగితాలు చింపి గాలిలోకి ఎగురవేయడంతోపాటు పేపర్ విమానాలను విసిరారు. వీరికి కాంగ్రెస్ సభ్యులు సహకరించారు. సభా మర్యాదకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన హెచ్చరికలను వీరు ఏమాత్రం పట్టించుకోలేదు. దీనితో ఆగ్రహం చెందిన స్పీకర్ అన్నాడీఎంకే పక్షం నాయకుడు వేణుగోపాల్‌తోపాటు మొత్తం 24 మంది సభ్యులను ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు.