జాతీయ వార్తలు

రాజ్యసభలో తమిళ ఎంపీల గలభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రాకుండానే బుధవారం రాజ్యసభ వాయిదా పడింది. కావేరీ నదిపై కర్నాటక నిర్మిస్తున్న అనకట్టకు వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు పదే పదే రాజ్యసభ చైర్మన్ పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో సభ పలుమార్లు వాయిదా పండింది. సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సభ్యుల ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఐదు రోజుల్లో సమావేశాలు ముగుస్తున్నందున సభ సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, రాఫెల్ ఒప్పందం, రైతుల సమస్యలు వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉందని, కొన్ని బిల్లులను ఆమోదించేందుకు సహకరించాలని వెంకయ్య నాయుడు సభ్యులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కావేరీ నదీ జలాలకు సంబంధించిన అంశంపై కేంద్రం జల వనరుల శాఖ మంత్రి సమాధానం ఇస్తారని చైర్మన్ ప్రకటించారు. అయినప్పటికీ సభా కార్యక్రమాలకు అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన సభ్యులు అడ్డుపడడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ దశలో ఇరు పార్టీలకు చెందిన 12 మంది సభ్యులను 255 నిబంధన కింద సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. అప్పటికీ సభ్యులు బయటకు వెళ్లకుండా అందోళన కొనసాగించారు. ఇక చేసేదిలేక సభను గురువారానికి వాయిదా వేశారు.