జాతీయ వార్తలు

రాఫెల్‌పై జేపీసీ వేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వెనకున్న ముడుపుల వ్యవహారం బయటపడాలంటే జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)తో దర్యాప్తు జరిపించవలసిందేనని తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ జయదేవ్ ఈ డిమాండ్ చేశారు. సీబీఐని పెంపుడు కుక్కలా మార్చివేసిన బీజేపీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. దేశంలో రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి 2014 మార్చి నెలలో దస్సాల్ట్-హెచ్‌ఏఎల్‌కు మధ్య ఒప్పందం కుదిరింది.. దీని ప్రకారం హెచ్‌ఏఎల్ 75 శాతం పనులను చేయవలసి ఉండింది.. అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసి విమానాల తయారీ పనిని రిలయెన్స్ సంస్థకు అప్పగించిందని జయదేవ్ ఆరోపించారు. రిలయెన్స్‌కు ఈ కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రకంగా నవరత్నాల్లో ఒకటైన హెచ్‌ఏఏల్‌ను అవమానించారని జయదేవ్ ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఫైళ్లు తన పకడ గదిలో ఉన్నాయని మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ మంత్రివర్గం సమావేశంలో చెప్పినట్లు గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ వెల్లడించారని, దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రహస్యాలు ఆయన పడక గదిలో ఉండడం ఏమిటని నిలదీశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఎక్కువ ధర చెల్లించి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోందని, ఈ విషయంలో పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. యుద్ధ విమానాలను తయారు చేసే దస్సాల్ట్ సంస్థతో యుపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? ఎన్‌డీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమిటనేది సభకు వెల్లడించాలని ఆయన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను అడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లినప్పుడు ఆయన వెంట ఎవరెవరు వెళ్లాలనేది కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. భారత వైమానిక దళానికి మొత్తం 126 యుద్ధ విమానాలు అవసరం ఉండగా ప్రభుత్వం ఇప్పుడు కేవలం 36 యుద్ధ విమానాలు మాత్రమే కొనుగోలు చేస్తోంది.. మరి మిగతావాటిని ఎక్కడినుండి కొనుగోలు చేస్తారని జయదేవ్ నిలదీశారు. దాదాపు 36వేల కోట్ల అప్పులున్న రిలయెన్స్ సంస్థ రాఫెల్ యుద్ధ విమానాలను ఎలా తయారు చేస్తుంది? అనుభవం లేని రిలయెన్స్ యుద్ధ విమానాలను తయారు చేయగలుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంటు పట్ల ఎలాంటి గౌరవం లేదు.. ఉండివుంటే ఆయన ఈ రోజు చర్చకు హాజరై సమాధానం చెప్పాల్సిందని విమర్శించారు.