జాతీయ వార్తలు

‘వందేమాతరం’ ఆలపించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జనవరి 2: మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున వందేమాతరాన్ని ఆలపించే సంప్రదాయంపై నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు విధింన తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవ దినాన ఆ గీతాన్ని ఆలపించి తీరుతారని స్పష్టం చేశారు.
ప్రతినెలా మొదటి పనిదినం రోజున సచివాలయంలో వందేమాతర గీతాన్ని ఆలపించే సంప్రదాయానికి తిలోదకాలిస్తూ జనవరి ఒకటిన ఆ గీతాన్ని పాడకపోవడంపై ముఖ్యమంత్రి కమలనాథ్‌ను తప్పుబట్టారు. ఇది ఆయన ఆజ్ఞల మేరకే జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. కాగా, దీనిపై సీఎం కమలనాథ్ స్పందిస్తూ వందేమాతరం ఆలాపన నిలిపివేయడం తాత్కాలికమేనని, కొత్తవిధానంలో దీనిని నిర్వహించడానికే తాము అలా చేశామని స్పష్టం చేశారు. అసెంబ్లీ, సచివాలయాలలో ప్రతినెలా మొదటి రోజున వందేమాతర గీతాన్ని ఆలపించడం 13 సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తోంది. శివరాజ్‌సంగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిలిపివేయడంపై ఆయన ట్వీట్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల మొదటిరోజైన జనవరి ఏడున తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు వల్లభ భవన్ (సచివాలయం)లో వందేమాతరాన్ని ఆలపించి తీరుతామని చౌహాన్ స్పష్టం చేశారు. ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తాను ఆహ్వానిస్తున్నానని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వారికి వందేమాతరం పాట పాడటం రాదో, లేక వారు దానిని పాడటాన్ని అవమానంగా భావిస్తున్నారో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రజలతో కలిసి ప్రతినెలా మొదటి రోజు తాను వందేమాతరాన్ని పాడుతానని ఆయన స్పష్టం చేశారు. దేశభక్తిని పెంపొందించే ఇంత మంచి సంప్రదాయాన్ని కమలనాథ్ ప్రభుత్వం ఎందుకు వద్దనుకుంటుంటో స్పష్టం చేయాలని బజీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ డిమాండ్ చేశారు. ఈ గీతంతో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక వర్గం వారు ఎన్నాళ్లుగానో చేస్తున్న వాదనకు లొంగి ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని తాము భావిస్తున్నామని ఆయన ఆరోపించారు.

కొత్త విధానం కోసమే: కమలనాథ్
ప్రతినెలా మొదటి పనిదినం రోజున సచివాలయంలో వందేమాతర గీతాన్ని ఆలపించే సంప్రదాయాన్ని రద్దు చేసే ఆలోచన తమకేమాత్రం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ తెలిపారు. దీనిని నూతన విధానంలో రూపకల్పన చేయడానికే దానిని తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఆయన చెప్పారు. అంతేగాని దీనిని రద్దు చేయాలన్న అజెండాగాని, ఆలోచన గాని, వత్తిడి గాని లేదని ఆయన తెలిపారు. వందేమాతర గీతం మన హృదయాల్లో పటిష్టంగా నాటుకుపోయి ఉందని, దానిని కొత్త విధానంలో త్వరలోనే పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనిని కొన్ని పార్టీల వారు రాజకీయం చేయడాన్ని ఆయన ఖండించారు. మందిర నిర్మాణం, ఆలయాలు, వందేమాతరం పేరిట తమ పార్టీ రాజకీయాలు చేయదని కమలనాథ్ విమర్శించారు.