జాతీయ వార్తలు

తొలగిన ట్రాఫిక్ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, జూలై 30: గుర్గావ్‌లో రెండు రోజులుగా కొనసాగిన ట్రాఫిక్ చక్రబంధం శనివారం చాలావరకు సడలిపోయింది. ట్రాఫిక్ సాఫీగా సాగిపోవడానికి వీలుగా హీరో హోండా చౌక్ సహా నగరంలోని 14 కీలక ప్రాంతాల్లో పోలీసు అధికారులను నియమించడంతో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా పోయాయి. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేవని, అయితే ట్రాఫిక్ నిదానంగా సాగుతోందని నగర పోలీసు కమిషనర్ నవ్‌దీప్ విర్క్ చెప్పారు. నగర పౌరుల్లో అనవసరపు భయాందోళనలు తలెత్తకుండా ఉండడానికి తమతో సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
అయితే సోహనా రోడ్, ఇతర రోడ్లపై నీళ్లు నిలిచిపోయిన కారణంగా ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బాద్షాపూర్ వాటికా చౌక్ వద్ద దాదాపు అయిదు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. గురువారం ఢిల్లీతోపాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీవర్షాల కారణంగా ఎన్‌హెచ్-8పై వేలాది వాహనాలు నిలిచిపోవడంతో రెండు రోజులుగా గుర్గావ్‌లో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు హీరో హోండా చౌక్ వద్ద నిషేధాజ్ఞలను సైతం విధించారు. రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. నిషేధాజ్ఞల కారణంగా కొన్ని రోడ్లపై దాదాపు 15 కిలోమీటర్ల పొడవుండిన ట్రాఫిక్ జామ్‌లు చాలావరకు తగ్గిపోయాయి. రోడ్లపై పరిస్థితులు మామూలుకావడంతో నిన్న రాత్రి నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. అయితే నిన్న రాత్రి తిరిగి వర్షం కురిసిన కారణంగా ట్రాఫిక్ నిదానంగా సాగుతోందని విర్క్ చెప్పారు. జాతీయ రహదారిపైన, నగరంలోని ఇతర రోడ్లపైన 14 కీలకమైన పాయింట్లను గుర్తించడం జరిగిందని, ప్రతి పాయింట్ వద్ద 24 గంటల పాటు పోలీసులను నియమించినట్లు చెప్పారు. నగరంలోని నాలుగు వైపులా నలుగురు ఎసిపిలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను పర్యవేయిస్తున్నారు. గుర్గావ్‌లో ట్రాఫిక్ జామ్‌కు తప్పు తమదేనని గుర్గావ్ నగర అధికారులు అంగీకరిస్తూ ఇబ్బందిపడిన వాహనదారులకు క్షమాపణలు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌కు కారణం పూర్తిగా తామేనని నగర డిప్యూటీ కమిషనర్ టిఎల్ సత్యప్రకాశ్ అంటూ, లోపం ఎక్కడుందో గుర్తించామని, ఇకపై ఇలాంటి సమస్య తలెత్తబోదని హామీ ఇచ్చారు.

చిత్రం.. గుర్‌గావ్‌లో ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్న హీరో హోండా చౌక్ వద్ద వరద నీరు చేరకుండా పనులు చేస్తున్న సిబ్బంది