జాతీయ వార్తలు

పొత్తుపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలా లేక ఒంటరిగానే పోటీ చేయాలా అనే విషయంపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీతో రఘువీరారెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ గురువారం రాహుల్‌తో భేటీ అయ్యారు. అనంతరం రఘువీరారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ- రానున్న శాసనసభ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై
రాహుల్‌తో చర్చించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు తదితర అంశాలపై 175 నియోజకవర్గాల నాయకులు అభిప్రాయాలను రాహుల్‌కు వివరించినట్టు చెప్పారు. పొత్తు కావాలని కొందరు, ఒంటరిగానే పోటీ చేయాలని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారని రఘువీరా వెల్లడించారు. పొత్తుల విషయంలో పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై వారం రోజుల్లో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రధాన లక్ష్యమని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే హోదాపైనే తొలి సంతకం పెడతానని రాహుల్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా రఘువీరా గుర్తుచేశారు.
చిత్రం..ఢిల్లీలో గురువారం నిర్వహించిన ‘హోదా’ ఆందోళనలో పాలుపంచుకున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.