జాతీయ వార్తలు

కేంద్రం పథకాలపై పంజాబ్ శీతకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుదాస్‌పూర్, జనవరి 3: కేంద్రప్రభుత్వానికి చెందిన పథకాలను పంజాబ్ ప్రభుత్వం నత్తనడకన అమలుచేస్తోందని, ఇకనైనా జడత్వాన్ని వదిలి నిర్ణీతకాలపరిమితిలోపల స్కీంలను, ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. గురువారం ఇక్కడ ఆయన శిరోమణి అకాలీదళ్, బీజేపీ పార్టీలు ఏర్పాటు చేసిన ర్యాలీలో మాట్లాడుతూ, అమృత్‌సర్, లూథియానా, జలంధర్‌లో కేంద్రానికి చెందిన స్మార్ట్ సిటీ పథకాల అమలు మందకొడిగా కొనసాగుతున్నాయన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే ఈ పథకాల పట్ల అశ్రద్ధ తగదన్నారవు. గత నాలుగేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన స్కీంలను వివరిస్తూ గురుదాస్‌పూర్ అభివృద్ధికి ఎంతో చేశామన్నారు. రవి నదీ జలాలు పంజాబ్‌కు ఉపయోగపడకుండా పాకిస్తాన్‌లోకి వెళుతున్నాయన్నారు.
ప్రకృతి ప్రసాదించిన వనరులను మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. షాపూర్‌కండి ప్రాజెక్టుకు నాలుగు నెలల క్రితం కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వెనకబడిన ప్రాంతాలకు సాగునీటి జలాలను సరఫరా చేయవచ్చన్నారు.
రెండవ వందల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లే సాగునీటి పంపిణీ వ్యవస్థ నిర్మాణానికి కేంద్రం రూ.800 కోట్లు మంజూరు చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ అమలు బాగుందన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం గత జీఎస్‌టీ మండలి సమావేశాల్లో అనేక వస్తువుల ధరలను తగ్గించామన్నారు. జీఎస్‌టీ పన్నును సరళీకృతం చేయడం వల్ల వర్తకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. జీఎస్‌టీ తొలి దశలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేశాయని, కాని ప్రజల స్పందన చూసి వెనక్కు తగ్గాయన్నారు. జీఎస్‌టీని వీలైనంత సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 550వ గురునానక్ జయంతి ఉత్సవాలను దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు అంతర్జాతీయ నగరాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్భ్రావృద్ధికి శిరోమణి అకాలీదళ్, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. గురుదాస్‌పూర్ బీజేపీ దివంగత ఎంపీ వినోద్ ఖన్నాను ఆయన గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా ఈ ప్రాంతాభివృద్ధికి చేసిన సేవలను ఆయన కొనియాడారు.
చిత్రం..గురుదాస్‌పూర్ ర్యాలీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ