జాతీయ వార్తలు

దేశ రాజధానిలో ‘హోదా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు, విభజన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి గురువారం పార్లమెంట్ ముట్టడి యత్నించింది. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు, వారిపై లాఠీ ఛార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం వారిని అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. హోదా సాధన సమితి నేతృత్వంలో వామపక్ష పార్టీలు కేంద్ర నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో వామపక్షాలతోపాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు పాల్గొన్నారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధు, బీవీ రాఘవులు తదితరులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలుచేయని ప్రధాని నరేంద్ర మోదీ ఏ మోహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని వారు ప్రశ్నిచారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, తెలుగుదేశం ఎంపీలు కె.రవీంద్ర కుమార్, టీజీ వెంకటేశ్ తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం పార్లమెంట్ ముట్టడికి వామపక్షాల నాయకులు, విద్యార్థులు యత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో వామపక్ష పార్టీల నాయకులు ప్రకాశ్ కారత్, మధు, రామకృష్ణ, తెలుగుదేశం ఎంపీలు టీజీ వెంకటేశ్, రవీద్రకుమార్ ఉన్నారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీ పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించినట్టు వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు.