జాతీయ వార్తలు

ఏపీలోని జాతీయ విద్యా సంస్థలకు రూ.6143 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.6143 కోట్లు కేటాయించిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఉన్నత విద్యా సంస్థల నిర్మాణంకోసం జరిపిన నిధులు కేటాయింపుల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొల్పే ఏడు జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్శిటీలకు కేటాయించిన మొత్తం రూ.6143 కోట్లలో ప్రభుత్వం ఏ సంస్థకు ఎంత కేటాయింపు జరిపిందీ, ఇప్పటివరకు ఎంత మొత్తం విడుదలైందో వివరించే పట్టికను మంత్రి తన జవాబుకు జత చేశారు.