జాతీయ వార్తలు

సుప్రీం ఆదేశాలు శిరసావహించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 3: సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోకుంటే శబరిమల ‘తంత్రి’ (ప్రధాన పూజారి) పదవి నుంచి తప్పుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. బుధవారంనాడు నిషేధిత వయస్సున్న ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయ సన్నిధికి చేరుకుని స్వామిని దర్శించుకున్న వెంటనే ఆలయాన్ని పూజారులు కొంతసేపు మూసివేసి సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ‘మహిళల సందర్శన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయడాన్ని తప్పుబట్టారు.. ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడమేనని.. లేకుంటే పూజారి పదవి నుంచి తప్పుకోవాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నదని అన్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోని ప్రవేశించడాన్ని స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించడంతోపాటు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ట్రావన్‌కోర్ బోర్డు విధించిన నిబంధనలు అంద రూ పాటించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.