జాతీయ వార్తలు

వారిది జీవన్మరణ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ ఘటన డిసెంబర్ 13వ తేదీన జరిగిందని, సహాయక చర్యలను ముమ్మరం చేసి గని కార్మికుల ప్రాణాలను కాపాడాలని కోర్టు ఆదేశించింది. ప్రతి క్షణం అమూల్యమైదని, ఉదాసీన వైఖరి పనికిరాదని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏ అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. గని కార్మికులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై 4వ తేదీ శుక్రవారం నివేదిక ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్రం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్మీ కూడా రంగంలోదిగేందుకు సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పారు. ఈ నెల 13వ తేదీన మేఘాలయలో తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సమీపంలో ఉన్న నదికి వరదలు వచ్చి ఆ నీరు గనిలోకి ప్రవేశించడంతో గని కార్మికులు భూగర్భంలో చిక్కుకున్నారు. ఈ గనుల ప్రవేశం సంక్లిష్టంగా ఉంటుంది. ఒక మనిషి మాత్రం లోపలికి వెళ్లేందుకు తగిన స్థలం ఉంటుంది. ఇప్పటికే ప్రకృతి విపత్తు పర్యవేక్షణ దళం సభ్యులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పారు. 72 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృంద సభ్యులు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.
కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ ఎక్కువ శక్తిసామర్థ్యం ఉన్నపంపులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, వారి సహాయం తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఇప్పటికే మేఘాలయ ప్రభుత్వం సహాయ చర్యల విషయంలో జాప్యం చేసిందని, వెంటనే గని కార్మికులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.