జాతీయ వార్తలు

టీడీపీ సభ్యుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలంటూ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చి సభా కార్యక్రమాలను స్తంభింపజేసిన 14 మంది తెలుగుదేశం సభ్యులను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ రెండు గంటలపాటు సభలోనే బైఠాయించి తమ డిమాండ్ల సాధనకోసం టీడీపీ సభ్యులు ధర్నా కొనసాగించారు. లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడిన తరువాతనే వారు సభ నుంచి బైటికి వెళ్లారు. తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహంతోపాటు కొనకళ్ల నారాయణ, అశోక గజపతిరాజు, నిమ్మల కిష్టప్ప, గల్లా జయదేవ్, మల్యాద్రి శ్రీరామ్, మాగంటి బాబు, మురళీమోహన్, జేసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, రామ్మోహన్ నాయుడు, బుట్టా రేణుక, రవీంద్రబాబు, కేశినేని శ్రీనివాస్‌లను ఈ నెల 8వ తేదీ వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై నిర్మిస్తున్న మేకదాటు ప్రాజెక్టును నిలిపివేయాలంటూ పోడియం వద్ద గొడవ చేసిన ఏడుగురు అన్నాడీఎంకే సభ్యులను కూడా 8వ తేదీ వరకు సస్పెండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 8న ముగుస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, అన్నాడీఎంకే సభ్యులు సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. అందుకే వారిని సభ నుండి సస్పెండ్ చేయవలసి వస్తోందని ఆమె స్పష్టం చేశారు.
లోక్‌సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే తెలుగుదేశం, అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను స్తంభింపజేశారు. జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని సుమిత్రా మహాజన్ హామీ ఇచ్చినా సభ్యులు ఏమాత్రం తగ్గకుండా నినాదాల జోరును కొనసాగించారు. అన్నాడీఎంకే సభ్యులు కొందరు కాగితాలు చింపి గాల్లోకి ఎగురువేశారు. తెలుగుదేశం సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా కాగితాలను చింపి గాలిలోకి ఎగురవేసేందుకు ప్రయత్నించగా అశోక్ గజపతిరాజు వారించారు. దానితో దివాకర్ రెడ్డి చించిన కాగితాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పై వదిలివేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలంటూ తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. దీనికి అన్నాడీఎంకే సభ్యుల నినాదాలు కూడా తోడుకావటంతో సభ పూర్తిగా స్తంభించిపోయింది. దీనితో సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. తెలుగుదేశం, అన్నాడీఎంకే సభ్యులు మళ్లీ పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇచ్చారు. పోడియం వద్ద గొడవ చేస్తూ నినాదాలిస్తున్న తెలుగుదేశం, అన్నాడీఎంకే సభ్యుల పేర్లను చదివి వినిపించి వెంటనే సీట్లలోకి వెవేళ్లకపోతే సభనుండి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఆ హెచ్చరికలను ఇరుపక్షాలు బేఖాతర్ చేశాయి. దీనితో సుమిత్రా మహాజన్ ఆ సభ్యులను సస్పెండ్ చేస్తూ, సభనుంచి బైటికి వెళ్లిపోవాలని అదేశించారు. కాగా తెలుగుదేశం సభ్యులు ఈ ఆదేశాన్ని బేఖారు చేసి నినాదాల జోరు పెంచారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. తెలుగుదేశం సభ్యుల బైటికి వెళ్లకుండా సభలో బైఠాయించి ధర్నా కొనసాగించారు. స్పీకర్ ఆదేశాలను సస్పెండెన సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అనంతరం తెలుగుదేశం సభ్యులు అక్కడే కొంతసేపు తచ్చాడి బైటికి వెళ్లిపోయారు.
చిత్రం..పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిస్తున్న తెలుగుదేశం సభ్యులు