జాతీయ వార్తలు

శ్రమజీవి ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో ఉగ్రవాదికి మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాన్‌పూర్(యుపి), జూలై 30: ఉత్తరప్రదేశ్‌లో 2005లో జరిగిన శ్రమజీవి ఎఖ్సప్రెస్ పేలుడులో బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహార్ అల్ ఇస్లామీ(హుజి)కి చెందిన ఉగ్రవాది ఒకరికి మరణ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు శనివారం తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్‌కు చెందిన అలంగీర్ అలియాస్ రోనీకి మరణ విక్షతో పాటు 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బుద్ధిరామ్ యాదవ్ తీర్పు చెప్పారు. జడ్జి శుక్రవారం ఈ కేసులో అలంగీర్‌ను దోషిగా పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో మరో నిందితుడు ఉబేదుర్ రెహమాన్ అలియాస్ బాబుపై తీర్పును ఆగస్టు 2న ప్రకటిస్తారు. 2005 జూలై 28న జాన్‌పూర్ స్టేషన్ సపీపంలో పాట్నానుంచి న్యూఢిల్లీ వెళ్తున్న శ్రమజీవి ఎక్స్‌ప్రెస్ బోగీలో పేలుడు సంభవించడంతో 12 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. బోగీలోని టాయిలెట్‌లో ఉంచిన ఆర్‌డిఎక్స్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు ఆ తర్వాత దర్యాప్తులో తేలింది.
జాన్‌పూర్ స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు ఒక వైట్ సూట్‌కేసుతో రైలు ఎక్కారని, అయితే కొద్ది సేపటికే వారు సూట్‌కేసు లేకుండా కదులుతున్న రైల్లోంచి దూకేసి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే బోగీలో పేలుడు సంభవించింది. దరిమిలా రోనీ, ఉబేదుర్ రెహమాన్‌తో పాటుగా హుజితో సంబంధాలున్న మరో ఇద్దరు బంగ్లాదేశీయులు నఫీకుల్ బిశ్వాస్, సోహాగ్ అలియాస్ హిలాల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసుకు సంబంధించి నఫీకుల్, హిలాల్ ప్రస్తుతం హైదరాబాద్ జైల్లో ఉండగా, మరో నిందితుడు షరీఫ్ పరారీలో ఉన్నాడు. మరో ఇద్దరు నిందితులు గులాం రజ్దానీ అలియాస్ యాహ్యా, సరుూద్‌లు కేసు విచారణలో ఉండగానే చనిపోయారు.

హుజి ఉగ్రవాది అలంగీర్ అలియాస్ రోనీ (ఫైల్‌ఫొటో)