జాతీయ వార్తలు

వామ్మో.. మెలానియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: న్యూయార్క్ నగరానికి చెందిన ఓ టాబ్లాయిడ్ పెను సంచలనాన్ని రేకెత్తించింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మోడల్‌గా ఉన్నప్పటి నగ్న ఫొటోలను ప్రచురించింది. 1995లో ఫ్రాన్స్ మ్యాగజిన్‌కోసం అలె డె బాసెవిల్లే అనే ఫొటోగ్రాఫర్ వీటిని తీసినట్టు న్యూయార్క్ పోస్టు తెలిపింది. పారిస్, ఇటలీల్లో మోడలింగ్ చేసిన మెలానియా న్యూయార్క్ సిటీకి వచ్చిన కొత్తలోనే వీటిని తీసినట్టుగా తెలిపింది. ఓ ‘కాబోయే ఫస్ట్‌లేడీ’కి సంబంధించి ఇంత సంచలన స్థాయిలో ఇప్పటివరకూ ఎవరి ఫొటోలు రాలేదని, ఇవన్నీ మెలానియాకు 25 ఏళ్లున్నప్పుడు తీసినవేనని వివరించింది. ఈ ఫొటోల గురించి డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలోనే స్పందించారు. ‘మెలానియా ఒకప్పుడు ఎంతగానో రాణించిన మోడల్. ఎన్నో పత్రికలకు కవర్ పేజీలకోసం ఫోజులిచ్చింది. ఎన్నో ఫొటో షూట్‌లలోనూ పాల్గొంది. ఈ తాజా ఫొటొలను ఓ ఐరోపా మ్యాగజిన్‌కోసం తీశారు. ఇదంతా కూడా మెలానియా నాకు పరిచయం కావడానికి ముందే జరిగిపోయాయి’ అని ట్రంప్ వివరించారు. కాగా, ఐరోపాలో ఇలాంటి ఫొటోలు మామూలేనని, నగ్నంగా ఫోజులివ్వడానికి మెలానియా ఎంత మాత్రం ఇబ్బంది పడలేదని ఫొటోగ్రాఫర్ బాసెవిల్లే తెలిపాడు.