జాతీయ వార్తలు

శిబిరాలే శరణ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, జనవరి 11: మాతృదేశంలో శరణార్థినయ్యాను. సొంత గడ్డలో చనిపోవాలని ఉంది. ఎన్నాళ్లని ఇతర ప్రదేశాల్లో శరణార్థిలాజీవించాలి అని 79 ఏళ్ల ఒక కాశ్మీరీ పండిట్ వాపోయారు. జమ్మునగరంలోని జగిత్ క్యాంపులో కాశ్మీర్‌లో ఉగ్రవాద మూకలు, మతోన్మాదుల దాడులతో భీతిల్లి లక్షలాది మంది కాశ్మీరీపండిట్‌లు జమ్ముకు వలస వచ్చారు. వీరంతా 1989-90 సంవత్సరంలో కాశ్మీర్ నుంచి వచ్చారు. సొంత దేశంలోనే శరణార్థిగా మారా. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ? మూడు దశాబ్ధాలైంది.
మా సమస్యలను పట్టించుకునే నాథుడు లేరని లాల్ అనే వృద్ధ కాశ్మీరీ పండిట్ అన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ నిరాశపెరుగుతోంది. వయస్సు మీదపడుతోంది. ఏ రోజైనా మరణించవచ్చు. సొంత ఊర్లో మరణించాలని ఉందని లాల్ అన్నారు. జగిత్ క్యాంపులో 20 వేల మంది కాశ్మీరీ పండిట్‌లు ఉన్నారు. కాశ్మీర్‌లో పరిస్థితులు కుదట పడలేదన్నారు. భద్రత, సేఫ్టీ ఉండాలన్నారు. మరో 80 ఏళ్ల వృద్ధుడు సోమావతి మాట్లాడుతూ కుప్వారా నుంచి వలస వచ్చామని, సొంత ప్రాంతానికి వెళ్లి ఉండాలని ఉందన్నారు. అఖిల భారత కాశ్మీరీ పండిట్ కాన్ఫరెన్స్ నేత టీకే భట్ మాట్లాడుతూ, అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.7.5 లక్షల ప్యాకజీ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఈ ప్యాకేజీని రూ.20లక్షలకు పెంచాలని ఆ నాటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం కోరిందన్నారు. ఈ ప్రతిపాదన ఇంతవరకుఅమలు కాలేదన్నారు. కాశ్మీరీ పండిట్లకు ఆరు వేల ఇండ్లను నిర్మించాలని కేంద్రం ప్రతిపాదిస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం వ్యతిరేకించిందన్నారు. 1900 మంది కాశ్మీరీ పండిట్ యువకులకు ఉపాధిని కేంద్రం కల్పించిందని, కాని స్థానికంగా వీరు ఇమడలేకపోతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సురీందర్ అంబార్దర్ చెప్పారు.