జాతీయ వార్తలు

ఇచ్చి పుచ్చుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లో పరస్పర బద్ధశత్రువులైన బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు ఈ రెండు పార్టీలు పొత్తును ఖరారు చేశాయి. కాగా ఈ కూటమిలో కాంగ్రెస్‌కు స్థానం లేదు. కాగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పోటీచేసే రాయబరేలి, అమేథీ లోక్‌సభ స్థానాలను ఆ పార్టీకే వదిలేస్తున్నట్లు ఇద్దరు నేతలు ప్రకటించారు. యూపీలో 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ బీఎస్పీ 38, ఎస్పీ 38 సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించారు. రెండు సీట్లను కాంగ్రెస్‌కు, మరో రెండు సీట్లను ఆర్‌ఎల్‌డీ పార్టీకి వదిలేశారు. అంబేద్కర్, లోహియా సిద్ధాంతాల ప్రాతిపదికన ఆవిర్భవంచిన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తాయని, బీజేపీని చిత్తుగా ఓడిస్తామని మాయావతి, అఖిలేష్ యాదవ్ శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోయడం విశేషం.
బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ తమ పొత్తుతో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు నిద్రలేకుండా చేస్తామని, రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేకుండా చేస్తామని అన్నారు. బీజేపీ హయాంలో అసహనం పెచ్చుమీరిందని, మతతత్వశక్తుల దాడులతో దళితులు, ఇతర అణగారిన వర్గాలు భీతిల్లుతున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా దారిద్య్రం, నిరుద్యోగం, అవినీతి పెరిగిందని, అప్పుడు కూడా స్కాంలు వెలుగుచూశాయని అన్నారు. బోఫోర్స్ స్కాంతో కాంగ్రెస్, రాఫెల్ స్కాంతో బీజేపీ దేశానికి మచ్చతెచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల ఉపయోగమేమీ లేదని అన్నారు. పొత్తులో మా ఓట్లు ఆ పార్టీకి బదిలీ అవుతున్నాయి కాని కాంగ్రెస్ ఓట్లు బదిలీ కావడం లేదు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు కుదరదన్నారు. అదే ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదలాయింపు అనుకున్నట్లుగా జరిగిందని లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓట్ల బదలాయింపు రుజువైందని అన్నారు. గతంలో కాంగ్రెస్ అత్యయిక పరిస్థితిని విధించిందని, ప్రస్తుతం బీజేపీ అప్రకటిత ఎమర్జన్సీని అమలు చేస్తోందని దుయ్యబట్టారు.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఎస్పీ, బీఎస్పీ పార్టీల పొత్తు పండుతుందని, ఈ పొత్తు లోక్‌సభ ఎన్నికలకే పరిమితం కాదని, 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని అన్నారు. గతంలో యూపీ నుంచి అనేక మంది ప్రధానమంత్రులయ్యారు.. ఈసారి కూడా యూపీనుంచి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఆ నేతకు మద్దతు ఇస్తామన్నారు. ఈసారి కూడా యూపీనుంచే దేశ ప్రధాని అవుతారని అన్నారు. మాయావతి మాట్లాడుతూ శివపాల్ యాదవ్ ద్వారా రాష్ట్రంలో మతతత్వశక్తుల బీజేపీ రెచ్చగొడుతోందని అన్నారు. డబ్బును వెదజల్లి ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని.. ఎస్పీ, బీఎస్పీ మధ్య తగాదా పెట్టేందుకు బీజేపీ చేసే ప్రయత్నాలను తిప్పిగొడుతామని అన్నారు. 1995లో లక్నో గెస్ట్‌హౌస్‌లో తనపై ఎస్పీ కార్యకర్తల దాడిని ప్రస్తావిస్తూ అదంతా గతమని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు మాయావతి చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని, ఇక్కడ వ్యక్తిగత లబ్ధికి తావులేదన్నారు. ఈ పొత్తును తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. బీజేపీని ఓడించే అన్ని పార్టీలు ఒక వేదికపైకి రావాలని ఆమె కోరారు. ఈ పొత్తు కేవలం మనుగడ సాధించేందుకేనని, దేశ ప్రయోజనాలు లేదని బీజేపీ విమర్శించింది. ఈ అప్రవితకలయికను ప్రజలు ఆమోదించరని బీజేపీ పేర్కొంది.
చిత్రం..సీట్ల సర్దుబాటుపై శనివారం లక్నోలో సమావేశమైన మాయావతి, అఖిలేష్ యాదవ్