జాతీయ వార్తలు

మూడ్రోజులూ సభకు రావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని పట్టుదలగా ఉన్న బిజెపి రానున్న మూడు రోజుల్లో పార్టీ ఎంపీలందరూ తప్పని సరిగా సభకు హాజరుకావాలంటూ సోమవారం విప్ జారీ చేసింది.
ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకునైనా దీన్ని ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో బిజెపి ఉంది. రాజ్యసభలో ప్రతికూల వాతావరణం ఉన్నందున ఒక వేళ ఓటింగ్ జరిగితే పరిస్థితి ఏమిటన్న ఆలోచనతోనే పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసినట్టు బిజెపి వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా జిఎస్‌టి బిల్లుకు సంబంధించి మాత్రం కొన్ని విపక్షాల మద్దతును బిజెపి సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ పొందగలిగింది. కాంగ్రెస్ మద్దతును కూడా పొందే ఉద్దేశంతో ఇటీవల ఇందులో కొన్ని కీలక సవరణలు కూడా చేసింది. ఉత్పాదక రాష్ట్రాలపై అదనంగా విధించాలనుకున్న ఒక శాతం పన్ను రద్దు చేయడం, ఈ చట్టం అమలులోకి వచ్చే మొదటి ఐదేళ్ల కాలంలో రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికీ కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన వైఖరిని సడలించినప్పటికీ బిల్లుకు కచ్చితంగా మద్దతు ఇస్తామన్న సంకేతాలను మాత్రం అందించలేదు. కాగా, మంగళవారం జరుగనున్న బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ బిల్లుకు సంబంధించి పార్టీ ఎంపీలకు వివరిస్తారు.