జాతీయ వార్తలు

బాబ్లీ కమిటీలో ఆంధ్రకూ చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో ఆంధ్రను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యవేక్షణ కమిటీలో ఏపీని తొలిగించాలన్న మహారాష్ట్ర, తెలంగాణ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. బాబ్లీ పర్యవేక్షణ కమిటీపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఖన్‌వాల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. విచారణ సమయంలో ‘తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలు ఒకరిపట్ల మరొకరు అసహనంతో ఉన్నాయి’ అని అత్యున్నత ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రకు బాబ్లీపట్ల ఎటువంటి ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆంధ్రకు సంబంధమే లేనప్పుడు, పర్యవేక్షణ కమిటీలో కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. మహారాష్ట్ర తరపున వాదించిన అంధ్యార్జున కూడా ఆంధ్రను పర్యవేక్షణ కమిటీ నుంచి తొలగించాలని వాదించారు. అయితే గోదావరి నదీజలాల వివాదం ట్రైబ్యునల్ ముందు విచారణలో ఉందా? అని ధర్మాసనం వేసిన ప్రశ్నకు, అటువంటిదేమీ లేదని, తెలంగాణ, మహారాష్టత్రో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఆంధ్ర కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే, ఏపీని పర్యవేక్షణ కమిటీలో ఉంచడంవల్ల భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని తెలంగాణ, మహారాష్టల్రు వాదించాయి. కాగా కమిటీ నుంచి ఏపీని తప్పిస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేకూరే ప్రమాదం ఉందని ఏపీ తరఫున ఏకె గంగూలీ వాదనలు వినిపించారు. తెలుగు రాష్ట్రాల విరుద్ధ వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం అసహనంతో ఉన్నాయని వ్యాఖ్యానించింది. అంతర్రాష్ట నదీ జలాల వినియోగంలో దిగువ రాష్ట్రాలు సైతం భాగస్వాములేనని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ న్యాయవాది వాదిస్తూ అలాగైతే గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఏడు రాష్ట్రాలు ఉన్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ వాదనలతో విభేందించిన ధర్మాసనం, మహారాష్ట్ర నీటి వినియోగాన్ని తెలుగు రాష్ట్రాలు పరిశీలించవచ్చని పేర్కొంది. బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షక కమిటీలో కేంద్ర జల వనరుల సంఘం, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ సభ్యులుగా ఉండగా, రాష్ట్రావిర్భావం అనంతరం తెలంగాణనూ పర్యవేక్షక కమిటీలో సభ్యునిగా చేర్చిన విషయం తెలిసిందే.