జాతీయ వార్తలు

కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 18: కర్నాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ సమావేశానికి నలుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూటమి నుంచి ముప్పుపొంచి ఉండడంతో బలప్రదర్శనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం శుక్రవారం జరిగింది. కాగా ఈ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడం వల్ల ప్రభుత్వానికి వెంటనే వచ్చే ముప్పేమీ లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఏడు నెలల క్రితం కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్‌పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాగా గైర్హాజరైన ఎమ్మెల్యేలు పార్టీని వీడితే తీవ్రపరిణామాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. మాజీ మంత్రి రమేష్ జర్కీహోలీ, బీ నాగేంద్ర, ఉమేష్ జాదవ్, మహేష్ కుమదహళ్లి అనే ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. తాను అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరు కావడం లేదని జాదవ్ అనే ఎమ్మెల్యే లేఖ రాశారు. కోర్టు కేసు వల్ల సమావేశానికి రాలేకపోతున్నట్లు బీ నాగేంద్ర ఎమ్మెల్యే తెలిపారు. సీఎల్‌పీ సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.

బీజేపీ పార్టీ కుయుక్తులను చిత్తుచేస్తామని మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంఘటితంగా ఉన్నారన్నారు. బలపరీక్ష పెడితే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామనీ కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు చెప్పారు.