జాతీయ వార్తలు

30 నుంచి ‘అన్నా’ మళ్లీ ఆమరణ దీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: అవినీతిపై ఉద్యమించేందుకు సామాజికవేత్త అన్నాహజారే మరోసారి సన్నద్ధమవుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని, లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని కోరుతూ ఆయన మరోసారి దీక్షకు దిగనున్నారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లును కనుక ప్రభుత్వం అమలు చేసి ఉంటే రాఫెల్ లాంటి కుంభకోణాలను తావుండేది కాదని పేర్కొన్న ఆయన రైతుల సమస్యల పరిష్కారానికి, అవినీతి నిరోధకానికి ఉద్దేశించిన లోక్‌పాల్ చట్టాన్ని అమలు చేయాలంటూ ఈ నెల 30 నుంచి నిరవధిక దీక్షను చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఈ దేశాన్ని ప్రమాదంలో పడేసి ఏకఛత్రాధిపత్య రాజ్యానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. లోక్‌పాల్‌ను అమలు చేయాలని తాను దీక్షకు దిగడం గత ఎనిమిదేళ్లలో ఇది మూడోసారని ఆయన చెప్పారు. రాఫెల్ ఒప్పందాన్ని అధ్యయనం చేసిన తర్వాత రెండు రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నాహజారే ప్రకటించారు. ఆమరణ నిరాహార దీక్షను రాలెగాన్ సిద్ధి నుంచి ఈ నెల 30న ప్రారంభిస్తానని, తన డిమాండ్లను నెరవేర్చేవరకు దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు ఈ ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని హజారే మండిపడ్డారు.
తాను దీక్ష చేస్తున్న రాలెగాన్ సిద్ధి గ్రామానికి రావద్దని అభిమానులకు హజారే విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతుగా వారు వారివారి ప్రాంతాల్లో దీక్షలు చేయాలని ఆయన కోరారు. హజారే దీక్షకు మద్దతు ప్రకటించిన రాష్ట్రీయ కిసాన్ మహాపంచాయత్ దేశంలోని తమ శాఖల్లో సైతం దీక్షలు చేస్తామని ప్రకటించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టల్ల్రో రైతులు పెద్దయెత్తున దీక్షలు నిర్వహిస్తారని కోర్ కమిటీ సభ్యులు శివకుమార్ తెలిపారు.