జాతీయ వార్తలు

ఎమ్మెల్యే గణేష్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 21: నగరంలోని ఓ ప్రైవేటు రిస్టార్‌లోతోటి ఎమ్మెల్యేపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన కాంగ్రెస్ సభ్యుడు జేఎన్ గణేష్‌పై హత్యాయత్నం చేసు నమోదయింది. ఆనంద్ సింగ్ అనే ఎమ్మెల్యేపై దాడి చేసిన గణేష్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి ఈగల్టన్ రిసార్ట్స్‌లో ఎమ్మెల్యే కొట్టాట చోటు చేసుకుంది. తన గదిలో డిన్నర్ ముగించుకుని వస్తుండగా గణేష్ దాడి చేశారని సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఆర్థిక సహకారం అదించలేదన్న అక్కసుతోనే దాడి చేశారని సింగ్ ఆరోపించారు. అయితే గణేష్ వాదన మరోలా ఉంది. ఆనంద్ సింగ్ మేనల్లుడు సందీప్ ముందు తనపై దాడికి దిగాడని, రాజకీయంగా తనను భూస్థాపితం చేస్తానని కూడా హెచ్చరించాడని గణేష్ చెబుతున్నారు. ఇరువురు శాసన సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ దశలో దగ్గరే ఉన్న కర్ర అలాగే కడవతో సింగ్‌పై దాడి చేశారు. సింగ్ తలను గోడకేసి కొట్టడంతో ఆయన కింద పడిపోయారు. గణేష్ రెచ్చిపోయి కడుపులోనూ, ముఖం పైనా కర్రతో ఇష్టానుసారం కొట్టినట్టు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఓ దశలో తనను చంపడానికి పిస్తోల్ ఇవ్వమని బిగ్గరగా అరిచినట్టు ఆనంద్‌సిం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గణేష్ నుంచి తనకు, తన కుటుంబానికి హాని ఉందని సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు గొడవ పడడం కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లో పడేసింది. మరోపక్క ప్రతిపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో నష్టనివారణకు రంగంలో దిగింది. మొత్తం ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర నేతృత్వంలో విచారణ జరిపించి, చివరికి గణేష్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.