జాతీయ వార్తలు

ప్యాకేజీ సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఆదేశం మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయంలో టిడిపిపి నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. శుక్రవారం ఉదయం తనను కలవనున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ప్యాకేజీ వివరాలను ప్రధాని మోదీ వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబును కలిసిన అనంతరం మధ్యాహ్నం 12.30కు టిడిపి ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈరోజే (గురువారం) మోదీని చంద్రబాబు కలవాల్సి ఉన్నా, ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం కలవనున్నారని సమాచారం. ప్రత్యేక హోదా స్థానంలో ఇవ్వజూపుతున్న ప్యాకేజీ వివరాలను తొలుత చంద్రబాబుకు వివరించిన అనంతరం టిడిపి ఎంపీలకు కూడా తెలియజేస్తారని తెలుస్తోంది.
ప్రత్యేక ప్యాకేజీలో...
రాష్ట్రంలో అమలుచేసే కేంద్ర పథకాలకు దాదాపు తొంభై శాతం నిధులను గ్రాంటుగా ఇచ్చే విధంగా ప్రత్యేక ప్యాకేజీని
కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని అంటున్నారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని ప్రత్యేక ప్యాకేజీలో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్‌కు సాలీనా సుమారు రెండు వేల కోట్ల రూపాయల అదనపు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసినట్లు తెలిసింది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అంతే మొత్తంలో లేదా అంతకంటే ఏక్కువ ఆర్థిక సహాయం కలిగేలా ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ఉన్న సుజానా చౌదరి, సి.ఎం.రమేష్‌లను తన కార్యాలయానికి పిలిపించుకుని ఏ.పికి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ గురించి చర్చించారు. ప్రత్యేక హోదా ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏయే రంగాలు, పథకాల్లో ఎంత ప్రయోజనం కలుగుతుందనేది నిర్థారించారు. అరుణ్‌జైట్లి సూచన మేరకు సుజనా చౌదరి, రమేష్‌లు ఈ వివరాలను సేకరించి ఆయనకు అందజేశారు. సుజనా చౌదరి, రమేష్‌లు అందజేసిన వివరాల ఆధారంగా ఏ.పికి ఇవ్వవలసిన ప్రత్యేక ప్యాకేజీ లేదా ఆర్థిక సహాయం రూపురేఖలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో అమలుచేసే పథకాలకు అరవై నుండి డెబ్బై శాతం నిధులు ఇస్తుంది, మిగిలిన నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించవలసి ఉంటుంది. ప్రత్యేక హోదా ఇచ్చే పక్షంలో ఆ రాష్ట్రంలో అమలుచేసే కేంద్ర పథకాలకు తొంభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మిగతా పదిశాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు దాదాపు తొంబై శాతం నిధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. కేంద్రం అమలు చేసే పథకాలకు తొంభై శాతం నిధులు కేటాయించటంతోపాటు కొన్ని రకాల పన్ను రాయితీలు కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు విదేశాలనుంచి, ముఖ్యంగా ఆర్థిక సంస్థల నుండి లభించే రుణాల చెల్లింపులో కూడా 90:10 నిష్పత్తి విధానాన్ని అవలంబించే విషయం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.