జాతీయ వార్తలు

బీజేపీ భయపడుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావటం బీజేపీకి భయం కలిగిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రియాంక, జ్యోతిరాధిత్య సింధియా లాంటి యువ నాయకులు కాంగ్రెస్‌లో కొత్త రక్తం నింపుతారాని, దీనితో పార్టీ ఎంతో బలపడుతుందని ఆయన బుధవారం మధ్యాహ్నం విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ప్రియాంక, జ్యోతిరాధిత్య ఎంతో బలమైన నాయకులని, వీరి వలన కాంగ్రెస్ మరింతగా పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. వీరిద్దరు యువ నాయకుల నాయకత్వంలో యూపీ రాజకీయాలను పూర్తిగా మార్చివేయాలని అనుకుంటున్నట్టు రాహుల్ ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీతో ఒప్పందం కుదరనందుకే ప్రియాంకను రాజకీయాలలోకి తెస్తున్నారా? అని అడుగగా అలాంటిదేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని తానెంతో గౌరవిస్తానన్నారు. వారు తమ తమ రాజకీయాలు
చేసుకుంటున్నారని, యూపీలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు తాను కొన్ని చర్యలు తీసుకున్నానని రాహుల్ వివరించారు. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టం చేశారు. కాబట్టి, వీలున్నంత వరకు కలిసి పని చేస్తామని రాహుల్ తెలిపారు. మాయావతి, అఖిలేష్‌తో తమకు శతృత్వం లేదన్నారు. వారి పట్ల ప్రేమ ఉన్నదని, అయితే తాము కాంగ్రెస్ సిద్ధాంతాల ఆధారంగా పని చేయవలసి ఉన్నదని రాహుల్ అన్నారు. ఇక మీదట యూపీలో తాము పూర్తి బలంతో పోటీ పడతామని రాహుల్ ప్రకటించారు. అఖిలేష్, మాయావతి తమతో చర్చలు జరపాలనుకుంటే జరపవచ్చునని, అందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రియాంక, జ్యోతిరాధిత్యను ఉత్తర ప్రదేశ్‌కు రెండుమూడు నెలల కోసం పంపిచడం లేదని వ్యాఖ్యానించారు. యూపీలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసే బాధ్యతను వీరిరువురికి అప్పగించానని రాహుల్ ప్రకటించారు. యూపీలో కాంగ్రెస్ సిద్ధాంతాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకుపోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. బడుగు, బలహీన ప్రజల ప్రయోజనాలను కాపాడడం, అందరిని కలుపుకొనిపోతూ పని చేయటం కాంగ్రెస్ విధానమన్నారు. ప్రియాంక, జ్యోతిరాధిత్య బాగా పని చేస్తారు, యూపీ యువకులకు కావలసింది వారికి ఇస్తారన్నారు. ప్రజల అభివృద్ధి కోసం రాజకీయం చేస్తామని, ప్రియాంక, జ్యోతిరాదిత్య ముందుండి రాజకీయం నడిపిస్తారని రాహుల్ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలావద్దా అనేది ప్రియాంక నిర్ణయించుకుంటారని ఆయన తెలిపారు. యూపీలో కాంగ్రెస్‌ను నిలబెట్టేందుకు ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావటం అనే పెద్ద నిర్ణయం తీసుకున్నామన్నారు. కష్టపడి పని చేసే సోదరి ప్రియాంక రాజకీయాలలోకి వచ్చి తనతో కలిసి పని చేయడ తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయన అన్నారు.