జాతీయ వార్తలు

సవాళ్లకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 11: లోక్‌సభ, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించడమే తమ ఆశయమని, ఆ లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించేది లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. తన సోదరి ప్రియాంక రాజకీయ అరంగేట్రానికి సోమవారం ఇక్కడ భారీ రోడ్‌షోతో నాంది పలికిన రాహుల్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. అందరికీ న్యాయం చేసే ప్రభుత్వాన్ని ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలన్న బృహత్తర బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, జ్యోతిరాదిత్య సిందియాకు అప్పగించామని రాహుల్ తెలిపారు. నాలుగున్నర గంటల పాటు సాగిన రోడ్‌షోలో ప్రధాని మోదీపై అడుగడుగునా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడే ప్రసక్తి లేదని, ముందుండే కీలక భూమికను పోషిస్తుందంటూ ప్రత్యర్థి పార్టీలకు రాహుల్ సవాలు విసిరారు. చౌకీదార్ చోర్ హై అంటూ ప్రధాని మోదీపై మరింత దూకుడు పెంచిన రాహుల్ ‘ఉత్తర ప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి ‘దొంగిలించిన’సొత్తును పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి దోచిపెట్టా’రంటూ విరుచుకు పడ్డారు. దేశానికే గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్‌లో అందరికీ న్యాయం చేసే ప్రభుత్వాన్ని నెలకొల్పే బాధ్యతను ప్రియాంక, జ్యోతిరాదిత్యకు అప్పగించానని చెప్పిన రాహుల్ ‘అందరికీ న్యాయం చేయాలన్నదే మా లక్ష్యం.అందుకోసం అహరహం శ్రమిస్తా’మని ఉద్ఘాటించారు. ప్రియాంక, సిందియా, ఇతర పార్టీ నేతలతో కూడిన రథంలో రోడ్‌షో నిర్వహించిన రాహుల్ మధ్యమధ్యలో ఆగి పెద్ద ఎత్తున గుమిగూడిన జనాన్నుద్దేశించి మాట్లాడారు. అవినీతి, నిరుద్యోగం, రైతుల సమస్యలు, యువత ఆశయాలు నెరవేర్చడం వంటి ఎన్నో అంశాలు కాంగ్రెస్ ముందున్నాయని, వాటన్నింటినీ సైద్ధాంతిక నిబద్ధతతో పరిష్కరించాల్నిన బాధ్యత కూడా పార్టీపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో నిమిత్తం లేకుండా చేతులు కలిపిన అఖిలేష్ యాదవ్, మాయావతిపై తనకెంతో గౌరవం ఉందని చెప్పిన రాహుల్ ‘ఎంత మంది ప్రత్యర్థులు ఉన్నా ధైర్యంగా, బలంగా కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంత బలంతో ముందుకు సాగుతుంది’అని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, నరేంద్ర మోదీల నుంచి ఎదురవుతున్న సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలతో మమేకం కావాలన్న కాంగ్రెస్ ఆశయానికి కట్టుబడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాజకీయ ప్రయాణమే ఉత్తర ప్రదేశ్‌తో మొదలైందని, ఇలాంటి రాష్ట్రంలో తమ పార్టీ ఎంత మాత్రం వెనుకబడి ఉండటానికి వీల్లేదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లను గెలుచుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. అన్ని రకాల ప్రత్యామ్నయాలతో విసుగెత్తి పోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానే్న కోరుకుంటున్నారని, ప్రత్యర్థులతో ముఖాముఖీ తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని రాహుల్ స్పష్టం చేశారు. 56అంగుళాల చాతీ కలిగిన కాపలాదారునంటూ చెప్పుకుంటున్న మోదీ అసలు రంగు రోజురోజుకూ బయట పడుతోందని, ఆయన వాగ్దానాల్లోని డొల్లతనాన్నీ ప్రజలు గుర్తించారని రాహుల్ ధ్వజమెత్తారు.
చిత్రం.. లక్నో రోడ్ షోలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శలు ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిరాదిత్య సింధియా