జాతీయ వార్తలు

నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులతో వివాహాలు సమస్యాత్మకంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం ఓ కీలక బిల్లును రూపొందించింది. పెళ్లయిన నెల రోజుల్లోనే తప్పనిసరిగా వివాహాలను రిజిస్టర్ చేసుకుని తీరాలన్న బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం 30రోజుల వ్యవిధిలో వివాహాన్ని రిజిస్టర్ చేసుకోని ఎన్‌ఆర్‌ఐల పాస్‌పోర్టును రద్దు చేయడం లేదా జప్తు చేయడం గానీ జరుగుతుంది. వారెంట్లు జారీ చేసినా కోర్టులకు హాజరుకానీ ఇలాంటి వారి స్థిర చరాస్తులను జప్తు చేసుకునేందుకు ఈ బిల్లు వల్ల కోర్టులకు వీలు కలుగుతుంది. ప్రవాస భారతీయుల వివాహాల రిజిస్టేషన్
బిల్లు-2019 పేరుతో దీన్ని సభలో ప్రవేశ పెట్టారు. భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో భారతీయ మహిళలను వివాహం చేసుకునే ఎన్‌ఆర్‌ఐలకు ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగియనున్నందున ప్రస్తుత సమావేశాల్లోనే దీన్ని ఆమోదించే అవకాశం కనిపించడం లేదు. అయితే రాజ్యసభలోనే దీన్ని ప్రవేశ పెట్టారు కాబట్టి జూన్ 3న పదహారో లోక్‌సభ రద్దయినా దీని చెల్లుబాటుకు ఎలాంట సమస్య ఉండదు.