జాతీయ వార్తలు

అదిరిన అరంగేట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 11:‘సరికొత్త భవితవ్యం నిర్మించుకుందాం..కొత్త రాజకీయాలకు నాంది పలుకుదాం..’అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ వీధుల్లో స్వైర విహారం చేశారు. దాదాపు నాలుగు గంట ల పాటు పాతిక కిలోమీటర్ల మేర సాగిన ప్రి యాంక-రాహుల్ రోడ్‌షో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం రగిలించింది. మరికొన్ని నెలల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల తరుణంలో ప్రియాంక రాజకీయ అరంగేట్రం దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ ఊపిరి పోసే అవకాశాలు మెరుగయ్యాయి. రోడ్డు పొడవునా ప్రియాంకకు జనం నీరాజనాలు పలికారు. అవధులే లేని ఉత్సాహం తో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అన్ని చోట్ల ప్రియాంక రోడ్‌షోకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇరువైపులా బారులు తీరిన జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగిన ప్రియాంకను చూసేందుకు జనం పోటీ పడ్డారు. ‘దుర్గామాతాకా రూప్ బెహన్‌జీ ప్రియాంక’ అన్న పోస్టర్లు కూడా అనేక చోట్ల దర్శనమిచ్చాయి. ఇందిరా గాంధీనే తాము మళ్లీ చూస్తున్నామా అన్న అనుభూతిని అనేక మంది వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలైతే సోమవారం ఉదయం నుంచి ప్రియాంక రోడ్‌షో ఏర్పాట్లలో తలమునకలయ్యారు. వచ్చిన అందరికీ ఆహార పొట్లాలు, తేనీరు, మంచినీళ్లను అందించారు. ఈ ఉత్సాహ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ దారిపొడవునా లౌడ్ స్పీకర్లలో దేశభక్తి గీతాలు వినిపించారు. మరోపక్క ప్రియాంక సేన కూడా తెరపైకి వచ్చింది. ఆమె ఫొటో కలిగిన టీషర్ట్‌లను ధరించిన కార్యకర్తలు ఈ రోడ్‌షోకు ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. రోడ్‌షోకు ముందు ప్రియాంక యూపీ ప్రజలకు ఇచ్చిన సందేశం ఈ ఉత్సవ వాతావరణానికి మరింత ఉత్సాహాన్ని అందించింది. ‘నేను ప్రారంభించే నవ రాజకీయాల్లో మీరంతా భాగస్వాములే’నన్న ప్రియాంక సందేశం రోడ్‌షో విజయానికి మరింతగా దోహదం చేసింది. ఇప్పటికే కోల్పోయిన రాజకీయ ప్రాబల్యాన్ని లోక్‌సభ ఎన్నికల్లో పునరుద్ధరించుకుంటామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక జనాకర్షక శక్తే కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపిస్తుందని, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రాంతంలో కాంగ్రెస్ మరింతగా దూసుకుపోవడం ఖాయమన్న నమ్మకాన్ని పార్టీ వర్గాలు ఈ సందర్భంగా వ్యక్తం చేశాయి. అయితే గత మూడు దశాబ్దాలుగా కుల రాజకీయాలే రాజ్యమేలుతున్న ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవజీవాలు కల్పించడం అన్నది ఎంత జనాకర్షక శక్తి ఉన్నా ప్రియాంకకు కష్టసాధ్యమేనన్న అనుమానాలున్నప్పటికీ నేటి రోడ్‌షోకు లభించిన ఆదరణను బట్టి చూస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇందిర మనువరాలి ప్రభావం ప్రబలంగానే ఉంటుందన్న అభిప్రాయం బలంగానే వ్యక్తమైంది. ప్రియాంకకు రోడ్‌షోలు కొత్త కాకపోయినా గాంధీ కుటుంబానికి కంచుకోటలైన అమేధీ, రాయ్‌బరేలీల వెలుపల ప్రచారం చేయడం మాత్రం ఆమెకు ఇదే మొదటిసారి.

చిత్రం.. రోడ్ షోలో ప్రజలకు ప్రియాంక అభివాదం