జాతీయ వార్తలు

కళ్లెట్టుకుని చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఫిబ్రవరి 11: యూపీలో అధికార బీజేపీ, సమాజ్‌వాదీ నేతల మధ్య కుంభమేళా మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సారధ్యంలో జరుగుతున్న కుంభమేళాలో స్వచ్ఛత కనిపించడం లేదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మొహిసిన్ రజా విరుచుకుపడ్డారు. 2013లో జరిగిన కుంభమేళాతో ఈ కుంభమేళాను పోల్చి చూసుకోండి, ఏది గొప్పగా జరిగిందో అర్థమవుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం గంగానదీ తీరాన జరుగుతున్న కుంభమేళాకు సంబంధించిన సామాజిక మాద్యమాల్లో వచ్చిన చిత్రాలను మాజీ సీఎం అఖిలేష్ మంత్రి రజాకు పోస్టు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చే కుంభమేళాను నిర్వహించడం ఇలాగేనా అంటూ ఎస్పీ చీఫ్ ప్రశ్నించారు. పరిసరాల్లో శుభ్రత లేదని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘అజాంఖాన్ పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు అఖిలేష్ హయాంలో జరిగిన కుంభమేళా ఫొటోలు మేం పంపుతాం. అఖిలేష్ స్నానం చేసిన ఫొటోలు దొరికితే పోస్టు చేస్తా’అని రజా వెల్లడించారు. ఈసారి గంగానది కడిగిన ముత్యంలా వెలిగిపోతోందని మంత్రి స్పష్టం చేశారు. అజాంఖాన్ సహా సమాజ్‌వాదీ పార్టీనేతలు కుంభమేళా జరిగిన ప్రాంతానికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థమవుతుందని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పవిత్ర కార్యక్రమాలను వాడుకోవద్దని రాష్ట్ర ముస్లిం, వక్ఫ్ సహాయ మంత్రి మొహిసిన్ హితవుచెప్పారు.