జాతీయ వార్తలు

రక్తమోడిన కాశ్మీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 14: జమ్ముకాశ్మీర్ మరోసారి రక్తసిక్తమైంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు జరిపిన పాశవిక ఆత్మాహుతి దాడిలో 42మంది సిఆర్‌పిఎఫ్ సైనికులు మరణించారు. దాదాపు 350కిలోల పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పుల్వాలా జిల్లాలోని అవంతిపురలో ఈ భయానక ఘాతుకానికి పాల్పడ్డారు. జమ్ము నుంచి కాశ్మీర్ వెళుతున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఈ దాడిలో మరో 42 మంది సైనికులు గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ దాడి జరిగింది. 2001 తర్వాత జరిగిన అతి పెద్ద ఉగ్రవాది దాడి అని ఆర్మీ పేర్కొంది. కాశ్మీర్‌లోని పుల్వా మా జిల్లాలో అవాంతిపురా వద్ద ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు మహీంద్రా స్కార్పియోలో 350 కేజీల పే లుడు పదార్ధాలతో కాన్వాయ్‌ను ఢీకొని ఉగ్రవాద దాడికి పాల్పడ్డారు. గాయపడిన 13 మంది జవాన్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఆర్మీ అధికారులు చెప్పారు. వీరిని శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడి జరిగిన సమయంలో 70 వాహనాల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెళుతున్నారు. శ్రీనగర్-జమ్ముజాతీయ రహదారిపై గోరిపొరా ఏరియా వద్ద ఉగ్రవాద ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణం చేస్తున్న వ్యాను తునాతునకలైంది. ఉగ్రవాద దాడికి కరడు గట్టిన మతోన్మాది ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వక్ఫాస్ కమాండో పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కాశ్మీర్‌లో కాకాపోరా ప్రాంతానికి చెందిన ఈ ముష్కరుడు ఏడాది క్రితం ఉగ్రవాద సంస్థలో చేరాడు. దాడికి గురైన బస్సు 76వ సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిందని ఆర్మీ అధికారులు చెప్పారు. ఈ దాడిని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఖండించారు. ఈ దాడితో తన రక్తం కుతకుతలాడుతోందన్నారు. పిరికిపందల చర్య అన్నారు. జవాన్లకు సెల్యూట్ చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని ఆత్మహుతిదాడిగా కేంద్రహోంశాఖ పేర్కొంది. సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కాన్వాయ్‌లో 2500 మంది జవాన్లు వెళుతున్నారన్నార. గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వాతావరణం సరిగా లేనందు వల్ల అనేక వాహనాలు రెండు రోజులుగా నిలిచిపోయాయి. దాంతో ఒక్కసారి 70వాహనాల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు శ్రీనగర్ ప్రాంతానికి బయలుదేరారని డీజీపీ చెప్పారు.
ఉగ్రవాదుల దాడిని ఎఐసీసీ అధ్యక్షుడురాహుల్ గాంధీ ఖండించారు. ఈ సంఘటన తనను కలిచివేసిందన్నారు. పిరికిపందల చర్య అన్నారు. అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, 2004-05 నాటి చీకటి రోజులు తిరిగి వచ్చాయని, ఈ దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడితో కాశ్మీర్ లోయలో అశాంతి నెలకొంటుందని, జవాన్లకు నివాళులు తెలియచేస్తూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ పేర్కొన్నారు. ఈ దాడిని ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఎఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా మాట్లాడుతూ ఈ దాడి దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం కాశ్మీర్‌కు వెళ్లి పరిస్థితులు సమీక్షించనున్నారు. 2016లో కాశ్మీర్‌లో యూరి సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 19 మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ సర్జికల్స్ దాడులను నిర్వహించింది. 2001 అక్టోబర్ 1వ తేదీన కాశ్మీర్ అసెంబ్లీ వద్ద జరిగిన ఆత్మహుతి దాడిలో 38 మంది మరణించారు.

చిత్రం.. కాశ్మీర్‌లోని అవంతిపురా వద్ద జరిగిన ఉగ్రదాడిలో తునాతునకలైన జవాన్ల వాహనం